టిప్ డబ్బులు కోసం కాసేపు తిట్టుకున్నారు..మరికాసేపు కొట్టుకున్నారు..చివరకు ఊహించని విధంగా

ఆ ఫంక్షన్‌ హాలులో ఓ కుటుంబం నిర్వహించిన శుభకార్యం బంధుమిత్రుల మధ్య ఆనందంగా ముగిసింది. దీంతో వారు సంతోషంగా అక్కడ పనిచేసేవారికి కొంత మొత్తాన్ని టిప్ కింద ఇచ్చారు.

టిప్ డబ్బులు కోసం కాసేపు తిట్టుకున్నారు..మరికాసేపు కొట్టుకున్నారు..చివరకు ఊహించని విధంగా
Follow us

|

Updated on: Dec 14, 2020 | 4:51 PM

ఆ ఫంక్షన్‌ హాలులో ఓ కుటుంబం నిర్వహించిన శుభకార్యం బంధుమిత్రుల మధ్య ఆనందంగా ముగిసింది. దీంతో వారు సంతోషంగా అక్కడ పనిచేసేవారికి కొంత మొత్తాన్ని టిప్ కింద ఇచ్చారు. ఆ డబ్బు కోసం ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. అందులో ఒక వ్యక్తి రాడ్డుతో దాడి చేయడంతో మరో వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్‌కు చెందిన పండిట్ అనే వ్యక్తి‌ సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ వద్ద దినసరి కూలీగా చేస్తూ జీవనం సాగించేవాడు. వారాసిగూడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏడునెలల క్రితం నెల జీతానికి పనిలో కుదిరాడు. మరొక వ్యక్తి అవసరం ఉండగా.. క్లాక్‌టవర్‌ వద్ద పరిచయం ఉన్న ఆనంద్‌(40)ను వారం రోజుల క్రితం అదే ఫంక్షన్‌ హాలులో చేర్పించాడు. లాలాపేట్‌కు చెందిన ఓ ఫ్యామిలీ ఈ నెల 12న రాత్రి ఫంక్షన్‌హాలులో సంగీత్‌ కార్యక్రమం నిర్వహించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫంక్షన్‌ ముగిసి వెళ్లేటప్పుడు ఆనంద్‌కు వారు టిప్పు కింద కొంత డబ్బులు ఇచ్చారు. ఈ టిప్పు డబ్బులు పంచుకునే విషయంలో పండిట్‌, ఆనంద్‌ మధ్య గొడవ మొదలైంది. అప్పటికే  మద్యం తాగి ఇద్దరూ..ఒకర్ని ఒకరు దూషించుకుంటున్నారు. అక్కడ పనిచేసే మరో మహిళ‌ పోచమ్మ వారికి సర్దిచెప్పి ఇంటికి వెళ్లిపోయింది.

కాసేపటికి  మద్యం మత్తులో ఉన్న పండిట్‌ ఇనుపరాడ్‌తో ఆనంద్‌ తలపై కొట్టి..అక్కడ్నుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం ఫంక్షన్ హాల్ నిర్వాహకులు వచ్చి చూడగా తలపై గాయాలతో ఆనంద్‌ విగతజీవిగా పడిఉన్నాడు. సమాచారమందుకున్న పోలీసులు… డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీం బృందాలతో స్పాట్‌కు చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆదివారం ఉదయం 2:30నిమిషాల సమయంలో పండిట్‌, ఆనంద్‌పై దాడి చేసిన విజువల్స్ సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఫంక్షన్‌హాలు ఓనర్ సయ్యద్‌ఫైజర్‌ కంప్లైంట్ మేరకు హత్య కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read :

డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్

ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!