AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయాన్ని పోగొడితేనే కరోనాతో సమర్థంగా పోరాడగలం..!

కరోనా మహమ్మారిపై ప్రజల్లో భయాన్ని పోగొడుతూనే భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని అలా చేస్తేనే వైరస్‌తో సమర్థంగా పోరాడగలమని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

భయాన్ని పోగొడితేనే కరోనాతో సమర్థంగా పోరాడగలం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2020 | 6:15 PM

Share

కరోనా మహమ్మారిపై ప్రజల్లో భయాన్ని పోగొడుతూనే భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని అలా చేస్తేనే వైరస్‌తో సమర్థంగా పోరాడగలమని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్ తరువాత అనుసరించాల్సిన హెల్త్ ప్రొటోకాల్‌పై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సోమవారం నుంచి ఏపీకి రాబోతున్న వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి వైద్య వివరాలను ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, హెల్త్‌ అసిస్టెంట్‌కు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వారికి పరీక్షలు చేసి ఆ తరువాత వారిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని సూచనలు చేశారు. వీటన్నింటికి సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సమీక్షలో విదేశాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన వారు సోమవారంనుంచి స్వదేశానికి తిరిగి వస్తారని.. వారు 11 చెక్‌పోస్ట్‌ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అవకాశాలున్నాయని అధికారులు జగన్‌కు వివరించారు. అమెరికా నుంచి వచ్చే వారు ముంబయి, హైదరాబాద్‌, చెన్నై విమానాశ్రయాలకు చేరుకుంటారని.. వారిని విశాఖ, తిరుపతి, విజయవాడలోనిక్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని జగన్‌కు తెలిపారు. రాష్ట్రంలోకి రాబోతున్న వారి కోసం అన్ని ఏర్పాట్లను చేసినట్లు అధికారులు తెలిపారు.

Read This Story Also: వారి వివరాలు చెప్పండి.. 500 క్యాష్‌ సొంతం చేసుకోండి..!

Follow Us
ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం..
ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం..
ఏంట్రా ఇది.. బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల.. కొంచెం అయితే
ఏంట్రా ఇది.. బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల.. కొంచెం అయితే
పొరపాటున కూడా ఈ రోజుల్లో బూట్లు కొనొద్దు.. ఈ తప్పులు చేస్తే..
పొరపాటున కూడా ఈ రోజుల్లో బూట్లు కొనొద్దు.. ఈ తప్పులు చేస్తే..
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.