Breaking.. “తబ్లిఘీ” సభ్యులపై NSA కింద కేసులు నమోదు చేసిన యోగీ సర్కార్..!
యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం ఘజియాబాద్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించిన తబ్లిఘీ జమాత్ సభ్యుల వ్యవహారంపై యూపీ సీఎం యోగీ సీరియస్ అయ్యారు. వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న నర్సింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. వారి ముందే అర్ధనగ్నంగా తిరుగుతూ వారికి ఇబ్బందులు కలుగజేస్తూ.. అసభ్య పదజాలం ఉపయోగించినట్లు వైద్యాధికారులు జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ […]

యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం ఘజియాబాద్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించిన తబ్లిఘీ జమాత్ సభ్యుల వ్యవహారంపై యూపీ సీఎం యోగీ సీరియస్ అయ్యారు. వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న నర్సింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. వారి ముందే అర్ధనగ్నంగా తిరుగుతూ వారికి ఇబ్బందులు కలుగజేస్తూ.. అసభ్య పదజాలం ఉపయోగించినట్లు వైద్యాధికారులు జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడ గట్టి భద్రతను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఈ ఘటన తెలుసుకున్న సీఎం యోగీ స్పందించారు. వారంతా మానవత్వానికి శత్రువులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారంతా చట్టాన్ని గౌరవించేవారు కాదని.. వారంతా మానవత్వానికే వ్యతిరేకులని.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కఠిన పరిస్థితుల్లో కూడా డ్యూటీ నిర్వహిస్తున్న.. మహిళా నర్సులతో వారు ప్రవర్తించిన తీరు అత్యంత క్రూరమైందన్నారు.ఎట్టి పరిస్థితుల్లో వారిని సహించేది లేదని.. వారందరిపై.. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.