ప్ర‌పంచంపై క‌రోనా పంజా.. ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతున్న కేసులు..

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం..

ప్ర‌పంచంపై క‌రోనా పంజా.. ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతున్న కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 8:09 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గురువారం కొత్తగా 2,22,825 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఫ‌లితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,78,854కి చేరింది. అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ 5,56,601 మంది మృతి చెందారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చింది. దేశంలో గురువారం రికార్డు స్థాయిలో 65,551 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అగ్ర‌రాజ్యంలో ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,21,19,999కి చేరుకుంది. ఇక నిన్న కొత్త‌గా960 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో, మొత్తం మృతుల సంఖ్య 1,35,822కి చేరింది. కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి. ఇక బ్రెజిల్, ఇట‌లీ, ఫ్రాన్స్, లండ‌న్ వంటి ప‌లు దేశాల్లో కూడా క‌రోనా కేసులు విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి.

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 487 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. దీంతో మొత్తం క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,296కి చేరినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ప్ర‌స్తుతం 2,69,789 యాక్టీవ్ కేసులు ఉండ‌గా.. క‌రోనా నుంచి కోలుకుని 4,76,378 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21,129 మంది మృతి చెందారు.

Read More:

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, మాజీ మంత్రి రామ‌స్వామి మృతి..

Latest Articles
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!