షాకింగ్‌: రెండోసారి సోకిన కరోనా.. హాంకాంగ్‌లో తొలి కేసు నమోదు

కరోనా మళ్లీ మళ్లీ సోకకపోవచ్చు అన్న అంచనాలకు చెక్ పడింది. హాంకాంగ్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ 33 ఏళ్ల వ్యక్తికి మరోసారి ఈ వైరస్‌ అటాక్ అయ్యింది

షాకింగ్‌: రెండోసారి సోకిన కరోనా.. హాంకాంగ్‌లో తొలి కేసు నమోదు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 25, 2020 | 2:44 PM

Coronavirus Re-Infection Hong Kong: కరోనా మళ్లీ మళ్లీ సోకకపోవచ్చు అన్న అంచనాలకు చెక్ పడింది. హాంకాంగ్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ 33 ఏళ్ల వ్యక్తికి మరోసారి ఈ వైరస్‌ అటాక్ అయ్యింది. ఇలా ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకడం ప్రపంచంలో మొదటి కేసు కావడం విశేషం. యూరప్ నుంచి ఆ వ్యక్తి ఇటీవల హాంకాంగ్‌కి రాగా.. ఎయిర్‌పోర్ట్ వద్ద జరిపిన పరీక్షల్లో అతడికి వైరస్ సోకినట్లు తేలింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా అతడికి వైరస్ నిర్ధారణ అయ్యింది. కాగా సదరు వ్యక్తికి ఏప్రిల్‌లో ఈ వైరస్ సోకగా కోలుకున్నారు.

మరోవైపు దీనిపై హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. అతడికి రెండుసార్లు వేర్వేరుగా కరోనా ఎలా సోకిందన్న విషయంపై వారు పరిశోధనలు మొదలుపెట్టారు. రెండోసారి అతడికి లక్షణాలేవి లేకుండా ఈ వైరస్ సోకగా, ఇన్ఫెక్షన్‌ తక్కువగా ఉండొచ్చని యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

”ఈ వైరస్ ఎప్పటికీ మనుషులను అంటిపెట్టుకునే ఉంటుందని అనిపిస్తోంది. సాధారణ జలుబులాగే ఈ వైరస్ కొనసాగే అవకాశం ఉండొచ్చు” అని క్వాక్‌ యంగ్‌ యెన్ పరిశోధకులు ఓ జర్నల్‌లో వివరించారు. వ్యాక్సిన్ వచ్చినా ఈ పరిస్థితి మారకపోవచ్చని వారు చెబుతున్నారు. కరోనా సోకిన కొన్ని వారాల తరువాత వారికి లక్షణాలు పోతున్నప్పటికీ.. శరీరంలో వైరస్ కొనసాగుతోందని.. ఈ పరిస్థితి శాస్త్రవేత్తలకు కూడా అంటుపట్టడం లేదని పలువురు అంటున్నారు.

Read More:

కర్ణాటకకు వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

ఇవాళ బెంగళూరుకు జగన్‌.. రేపు కూడా అక్కడే ఉండనున్న సీఎం