ప్రధాని మోదీ యోగా.. ఐసయిపోయిన ఇవాంకా

తీరిక దొరికినప్పుడల్లా యోగా ప్రాక్టీసు చేసే ప్రధాని మోదీకి ఈ యోగా లక్షలాది అభిమానులను సమకూర్చింది. తరచూ ఆయన తన యోగా తాలూకు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మంగళవారం ఆయన ‘యోగా నిద్ర’ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ స్పందించి ప్రశంసలు గుప్పించారు. ‘దిసీజ్ వండర్ ఫుల్.. థ్యాంక్యు ‘ అని తనను ఈ వీడియో ఎంతో ఆకట్టుకుందన్నారు. వారానికి ఒకటి, రెండు […]

  • Umakanth Rao
  • Publish Date - 8:02 pm, Tue, 31 March 20
ప్రధాని మోదీ యోగా.. ఐసయిపోయిన ఇవాంకా

తీరిక దొరికినప్పుడల్లా యోగా ప్రాక్టీసు చేసే ప్రధాని మోదీకి ఈ యోగా లక్షలాది అభిమానులను సమకూర్చింది. తరచూ ఆయన తన యోగా తాలూకు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మంగళవారం ఆయన ‘యోగా నిద్ర’ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ స్పందించి ప్రశంసలు గుప్పించారు. ‘దిసీజ్ వండర్ ఫుల్.. థ్యాంక్యు ‘ అని తనను ఈ వీడియో ఎంతో ఆకట్టుకుందన్నారు. వారానికి ఒకటి, రెండు సార్లు తాను యోగా నిద్రను ప్రాక్టీసు చేస్తానని, దీనివల్ల మెదడు చాలా రిలాక్స్ అవుతుందని, స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గుతాయని మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. నిద్ర యోగా యూ ట్యూబ్ వీడియోను కూడా లింక్ చేశారు. ఏమైనా ఈ వీడియో ఇవాంకాకు తెగనచ్ఛేసింది. బహుశా ఆమె కూడా దీన్ని ప్రాక్టీసు చేయవచ్చు.