AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ఓ మ‌హిళ న‌డిరోడ్డుపై ప్ర‌స‌వించిన సంఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు స్పందించి ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

రోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Jyothi Gadda
|

Updated on: May 06, 2020 | 2:57 PM

Share
క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌త నెల ప‌దిహేను రోజులుగా ఉపాధి లేక‌, చేతిలో చాలిచాల‌ని డ‌బ్బుల‌తో అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ముఖ్యంగా వ‌ల‌స కూలీలు, కార్మికుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి. ఇత‌ర ప్రాంతాల్లో ఉండ‌లేక‌, సొంతూళ్ల‌కు వెళ్లేందుకు బ‌య‌ల్దేరుతున్నారు. ర‌వాణా స‌దుపాయం అందుబాటులో లేక‌పోవ‌డం, ప్రైవేటు వాహ‌నాలు కూడా లేని పరిస్థితుల్లో వారంతా కాలిన‌డ‌క‌నే వెళ్లేందుకు సిద్ద‌ప‌డుతున్నారు. మ‌హిళ‌లు, చిన్న‌పిల్ల‌లు స‌హా రోడ్ల వెంట బారులు తీరి వెళ్తున్నారు. అలా బ‌య‌ల్దేరిన‌ ఓ మ‌హిళ న‌డిరోడ్డుపై ప్ర‌స‌వించిన సంఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు స్పందించి ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా….
చత్తీస్‌గఢ్‌కు చెందిన అనిత, లోకేష్‌ దంపతులు వారి స్వ‌స్థ‌లానికి వెళ్లేందుకు కాలిన‌డ‌క‌న బ‌య‌ల్దేరారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్ మీదుగా నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న అనితకు పురిటి నొప్పులు రావ‌టంతో నడిరోడ్డుపైనే ప్రసవించింది. విషయం తెలుసుకున్న నార్సింగ్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని త‌ల్లీ బిడ్డ‌ను రామాయంపేట ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు.

Follow Us
స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు..
స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు..
చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు..
చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు..
50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యువతిలా..ముసలితనాన్ని ఆపేందుకురూ.94 లక్షలు
50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యువతిలా..ముసలితనాన్ని ఆపేందుకురూ.94 లక్షలు
కెప్టెన్‌గా మారిన తొలి సీజన్‌లోనే ఐపీఎల్ కప్పు కొట్టిన ప్లేయర్లు
కెప్టెన్‌గా మారిన తొలి సీజన్‌లోనే ఐపీఎల్ కప్పు కొట్టిన ప్లేయర్లు
కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే
కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే
ద్రాక్ష ప్రియులు తెలుసుకోవాల్సిన ఆసక్తికర నిజాలు ఇవే!
ద్రాక్ష ప్రియులు తెలుసుకోవాల్సిన ఆసక్తికర నిజాలు ఇవే!
కుళ్లిన టమాటోలను పారేస్తున్నారా?.. ఈ ట్రిక్స్ తెలిస్తే వదలరు
కుళ్లిన టమాటోలను పారేస్తున్నారా?.. ఈ ట్రిక్స్ తెలిస్తే వదలరు
అరటి తొక్కపై కాలు వేస్తే ఎందుకు జారిపడతాం.. దాన్ని వెనకున్న..
అరటి తొక్కపై కాలు వేస్తే ఎందుకు జారిపడతాం.. దాన్ని వెనకున్న..
ఇంట్లో వాము మొక్క పెట్టడం శుభమా అశుభమా? చాలామందికి తెలియని విషయం!
ఇంట్లో వాము మొక్క పెట్టడం శుభమా అశుభమా? చాలామందికి తెలియని విషయం!
ఒక్కరోజే భారీగా బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే క్రాష్
ఒక్కరోజే భారీగా బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే క్రాష్