రేప‌టి నుంచి తెలంగాణ‌లో మ‌ద్యం అమ్మ‌కాలు ?

తెలంగాణ‌లో మ‌ద్యం ప్రియుల‌కు శుభ‌వార్త‌…రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. రేప‌టి నుంచే లిక్క‌ర్ అందుబాటులోకి రానుంది. సుమారు 30 నుంచి 50 శాతం పెంపుతో అమ్మ‌కాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే న‌గ‌రంలోని ప‌లుచోట్ల‌ వైన్ షాప్‌ల‌ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు వ్యాపారులు. ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని బారికేడ్ లు ఏర్పాటు చేస్తున్నారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు గానూ…సామాజిక దూరం పాటించేలా చర్యలు చేప‌డుతున్నారు. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా… కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ […]

రేప‌టి నుంచి తెలంగాణ‌లో మ‌ద్యం అమ్మ‌కాలు ?
Follow us

|

Updated on: May 05, 2020 | 5:14 PM

తెలంగాణ‌లో మ‌ద్యం ప్రియుల‌కు శుభ‌వార్త‌…రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. రేప‌టి నుంచే లిక్క‌ర్ అందుబాటులోకి రానుంది. సుమారు 30 నుంచి 50 శాతం పెంపుతో అమ్మ‌కాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే న‌గ‌రంలోని ప‌లుచోట్ల‌ వైన్ షాప్‌ల‌ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు వ్యాపారులు. ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని బారికేడ్ లు ఏర్పాటు చేస్తున్నారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు గానూ…సామాజిక దూరం పాటించేలా చర్యలు చేప‌డుతున్నారు. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా…

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో మ‌ద్యం అమ్మ‌కాలు జోరందుకున్నాయి. పొరుగు రాష్ట్రంలో ఏపీలో సోమ‌వారం నుంచే వైన్ షాపులు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్ కరువులో ఉన్న మద్యం ప్రియులు.. ఇన్నాళ్లకు షాపులు తెరుచుకోవడంతో పెద్ద మొత్తంలో బాటిళ్లు పట్టుకెళ్లిపోయారు. కర్నాటకలో ఓ వ్యక్తి ఏకంగా రూ.50 వేల మద్యం కొనుగోలు చేశాడు. అంతలా వైన్ షాపులపై దండయాత్ర చేశారు మందుబాబులు. దాంతో ఎన్నడూ లేనంతగా మద్యం అమ్మకాలు జరిగాయి. సోమవారం ఒక్కరోజే ఆయా ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. ఇక ఏపీలో నిన్న ఒక్క రోజే రూ.68.70 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లలలో మద్యం షాపులను తెరవలేదు. 66.77 శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఐనప్పటికీ పెద్ద మొత్తంలో సరుకు అమ్ముడుపోయింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ వైన్ షాపుల‌ను తెరిచి రాష్ట్రానికి ఆదాయం రాబ‌ట్టే ప‌నిలో ప్ర‌భుత్వం ఉందంటున్నారు ప‌లువురు విశ్లేష‌కులు.

ఇక‌పోతే, రాష్ట్రంలో గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో మాత్ర‌మే మ‌ద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే, మధ్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 30 నుంచి 50 శాతం వ‌ర‌కు ధరలు పెంచే అవకాశం ఉందని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే రెడ్ జోన్లలో మాత్రం  లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేయనున్నారు. హైదరాబాద్ లో  కంటెన్మెంట్ ఏరియాల‌ను వదిలేసి అమ్మకాలు ఉండొచ్చు అని సమాచారం. ఇదిలా ఉంటే, ఇప్ప‌టికే సికింద్రాబాద్‌, తార్నాక‌, లాలాగూడా, ఉప్ప‌ల్‌, నాచారం త‌దిత‌ర ప్రాంతాల్లో వైన్ షాపుల ముందు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!