AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా విలయతాండవం.. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. పెరుగుతున్న కేసులతో అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కేవలం ఆదివారం ఒక్క రోజే ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 1,83,000 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 4,743 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా బ్రెజిల్‌లో 54,771 ఉండగా, అమెరికాలో 36,617, భారత్‌లో 15,400 కేసులు నమోదయ్యాయని తెలిపింది. పెరుగుతున్న […]

కరోనా విలయతాండవం.. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే..
Sanjay Kasula
|

Updated on: Jun 22, 2020 | 10:57 AM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. పెరుగుతున్న కేసులతో అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కేవలం ఆదివారం ఒక్క రోజే ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 1,83,000 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 4,743 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా బ్రెజిల్‌లో 54,771 ఉండగా, అమెరికాలో 36,617, భారత్‌లో 15,400 కేసులు నమోదయ్యాయని తెలిపింది. పెరుగుతున్న కేసులతో అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఎన్నో చర్యలు చేపడుతన్నా కంట్రోల్ కావటం లేదని ఆందోళన చెందుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా..(ఆదివారం)

ఆదివారం పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 90,44,563కి చేరింది. ఈ మహమ్మారి వల్ల గత మూడు నెలల్లో ఇప్పటివరకు 4,70,665 మంది బాధితులు మరణించారు. వైరస్‌ బారినపడిన 48,37,952 మంది కోలుకోగా, మరో 37,35,946 మంది చికిత్స పొందుతున్నారు.

అమెరికాలో కొవిడ్-19 కేసులు(ఆదివారం)

అమెరికాలో ఆదివారం 36వేల  కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 23,56,657కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 1,22,247 మంది మరణించగా, 12,54,055 మంది చికిత్స పొంతున్నారు. మరో 9,80,355 మంది బాధితులు కోలుకున్నారు.

బ్రెజిల్‌లో పెరుగుతున్న కొవిడ్-19 

బ్రెజిల్‌లో కరోనా కేసులు భారీ వేగంగా రికార్డవుతున్నాయి. దీంతో దేశంలో 10,86,990 మంది కరోనా వైరస్‌ బారిన పడగా.. 50,659 మంది మృతిచెందారు. మరో 4,57,105 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

రష్యాలో ఇప్పటి వరకు..

రష్యాలో ఇప్పటివరకు 5,84,680 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ  కరోనా వైరస్‌ మహమ్మారికి  8,111 మంది బాధితులు మ‌ృత్యువాత పడ్డారు.

భారత్‌లో ఆదివారం ఒక్క రోజే..

ఇక భారత్‌లో నిన్న ఒక్క రోజే 15 వేల400 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4లక్షల26వేల910కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 13,703 మంది చనిపోయారు. భారత్ లో అధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు ఉన్నాయి.

Follow Us