తండ్రితో పోటీ పడిన సితార
ఎప్పుడూ బిజీగా ఉండే సినిమా ప్రముఖులు లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. తమ కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా..
ఎప్పుడూ బిజీగా ఉండే సినిమా ప్రముఖులు లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. తమ కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపేస్తున్నారు. ఇప్పటికే గౌతమ్, సితారలతో కలిసి చేస్తున్న అల్లరి, ఆటలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మహేశ్ ముద్దుల కూతురు లిటిల్ స్టార్ సితార తన తండ్రితో కలిసి ఇండోర్ స్విమ్మింగ్‌ఫూల్లో పోటీ పడ్డారు.
తండ్రీ కూతుళ్లు స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సితార ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘నాన్నతో పోటీ అంటే చాలా సరదాగా ఉంటుంది. నాన్నతో నేను పాల్గొన్న మొదటి స్విమ్మింగ్ పోటీ ఇది’ అంటూ ముద్దు ముద్దు మాటలను జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.