వైట్ హౌస్ లో కరోనా టాస్క్ ఫోర్స్ కి ఇక చెల్లు చీటీ ! ఉపయోగం లేదంటున్న ట్రంప్

వైట్ హౌస్ లో కరోనా టాస్క్ ఫోర్స్ కి ఇక చెల్లు చీటీ ! ఉపయోగం లేదంటున్న ట్రంప్

కరోనా వైరస్ అదుపునకు తీసుకోవలసిన చర్యలను సమన్వయం  చేసేందుకు, ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మెడికల్ ఫెసిలిటీలకు మధ్య కో-ఆర్డినేషన్ ను పెంచేందుకు వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ ను రద్దు చేయనున్నారు. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నెలాఖరు లోగా లేదా జూన్ మొదటివారానికల్లా ఈ టాస్క్ ఫోర్స్ ను ‘మూసివేస్తాం’ అని ఆయన చెప్పారు. సామాజిక దూరంపై  జాతీయ సిఫారసులను […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

May 06, 2020 | 10:17 AM

కరోనా వైరస్ అదుపునకు తీసుకోవలసిన చర్యలను సమన్వయం  చేసేందుకు, ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మెడికల్ ఫెసిలిటీలకు మధ్య కో-ఆర్డినేషన్ ను పెంచేందుకు వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ ను రద్దు చేయనున్నారు. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నెలాఖరు లోగా లేదా జూన్ మొదటివారానికల్లా ఈ టాస్క్ ఫోర్స్ ను ‘మూసివేస్తాం’ అని ఆయన చెప్పారు. సామాజిక దూరంపై  జాతీయ సిఫారసులను రూపొందించేందుకు ఉద్దేశించి..  వైద్య నిపుణుల సేవలను కూడా ఈ టాస్క్ ఫోర్స్ వినియోగించుకుంటూ వస్తోంది. అయితే ఈ బృందం బాధ్యతలను రెగ్యులర్ ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తాయని  పెన్స్ పేర్కొన్నారు.

కరోనా కారణంగా దారుణంగా పడిపోయిన ఆర్ధిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడమే తన లక్ష్యమని అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నారు. వచ్ఛే ఐదేళ్లకు కూడా ఈ దేశాన్ని ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితిని కల్పించబోమన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనాకు    గురై మృతి చెందినవారి సంఖ్య సుమారు 70 వేలకు పెరిగింది. అయినా ట్రంప్ మాత్రం ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఎకానమీని పెంచుకుందామనే అంటున్నారు.

అటు-ట్రంప్ కి, కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు  డాక్టర్ ఆంథోనీ ఫోజీకి మధ్య తలెత్తిన విభేదాలు కూడా టాస్క్ ఫోర్స్ రద్దు నిర్ణయానికి దారి తీసి ఉండవచ్ఛునని భావిస్తున్నారు. ఈ వైరస్ చైనాలోని వూహాన్ నుంచి పుట్టిందని ట్రంప్ ఆరోపిస్తుండగా.. ఫోజీ మాత్రం ఇది మానవ సృష్టి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. మొదట ప్రకృతిలో పుట్టిన ఈ వైరస్ క్రమంగా జీవుల్లో ప్రవేశించి ఉండవచ్ఛునన్నది ఆయన థియరీ !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu