నాయీ బ్రాహ్మణులకు టీ సర్కార్ చేయూత
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంబంధించి ఏదో ఒకరకమైన ప్రభుత్వం పథకం విడుదల చేస్తూ..ఆయా వర్గాల ప్రజలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పిస్తూ..వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూనే ఉంది. కుమ్మరులు, కమ్మరులు మొదలు దేవుళ్లకు నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించే బ్రహ్మణుల వరకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర […]

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంబంధించి ఏదో ఒకరకమైన ప్రభుత్వం పథకం విడుదల చేస్తూ..ఆయా వర్గాల ప్రజలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పిస్తూ..వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూనే ఉంది. కుమ్మరులు, కమ్మరులు మొదలు దేవుళ్లకు నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించే బ్రహ్మణుల వరకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో నాయీ బ్రాహ్మణులు అన్ని రకాలుగా నష్టపోయిన విషయాన్ని సంఘం నాయకులు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. లాక్‌డౌన్ తో ఆర్థికంగా నష్టపోయిన నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని, విద్యుత్ రాయితీలు కల్పించాలని, పని ముట్లను అందించాలని సంఘ నాయకులు వినతి పత్రంలో కోరారు. వారి సమస్యల పట్ల వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదించి దశల వారీగా సమస్యలు పరిష్కరించనున్నట్లు హామీనిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వినోద్ కుమార్ హామీనిచ్చారు.
