Breaking News పదివేల మంది హెల్త్ వర్కర్లకు కరోనా!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నుంచి మానవాళిని రక్షిస్తున్న హెల్త్ వర్కర్లే కరోనా బారిన పడిన దారుణ పరిణామం చోటుచేసుకుంది. అది కూడా ఒకరిద్దరికో కాదు....

Breaking News పదివేల మంది హెల్త్ వర్కర్లకు కరోనా!
Follow us

|

Updated on: May 22, 2020 | 3:43 PM

Dangerous development in corona virus effect: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నుంచి మానవాళిని రక్షిస్తున్న హెల్త్ వర్కర్లే కరోనా బారిన పడిన దారుణ పరిణామం చోటుచేసుకుంది. అది కూడా ఒకరిద్దరికో కాదు.. ఏకంగా పదివేల మంది హెల్త్ వర్కర్లకు కరోనా సోకిందని ఏకంగా దేశ ఉన్నత అధికారులే వెల్లడించడంతో ప్రపంచం అవాక్కయ్యింది.

చైనా తర్వాత కరోనా ఎఫెక్ట్ ఇటలీ, ఇరాన్‌లకే తొలుత విస్తరించింది. రెండు దేశాల్లో ఒక దశలో కరోనా తాకిడికి జనం పిట్టల్లా రాలిపోయారు. పరిస్థితిని గాడిలో పెట్టేందుకు రెండు దేశాల ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకున్నాయి. చాలా మటుకు రెండు దేశాలు కూడా కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగాయి. అయితే.. ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండు దేశాల్లోను భారీగా ప్రాణనష్టం సంభవించింది.

ఇదంతా ఒకెత్తైతే.. కరోనాను కట్టడి చేయడంలో ముందున్న ఆరోగ్య కార్యకర్తలే ఇపుడు ఈ దేశాల్లో ప్రాణసంకటంలో పడిపోయారు. ముఖ్యంగా ఇరాన్ దేశంలో ఏకంగా పదివేల మంది హెల్త్ వర్కర్లకు కరోనా సోకినట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడైంది. ఈ మేరకు ఇరాన్‌కు పలు వార్తా సంస్థలు గణాంకాలను వెల్లడించాయి. ఇరాన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ సహాయ మంత్రి ఖాసీమ్‌ జాన్‌బాబాయి పేరిట ఐఎస్‌ఎన్‌ఏ వార్తా సంస్థ వెల్లడించిన వివరాలను చూసిన ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఇరాన్ దేశంలో ఇప్పటి వరకు లక్షా 29 వేల మందికి కరోనా సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో హెల్త్ వర్కర్లు 8 వందల మంది వున్నారని అక్కడి ప్రభుత్వం గత వారం ప్రకటించింది. అయితే, తాజా గణాంకాల ప్రకారం వీరి సంఖ్య పదివేలకు పైనే వుండొచ్చని ఐఎస్ఎన్ఏ మీడియా సంస్థ వెల్లడించింది. కరోనా సోకిన హెల్త్ వర్కర్లలో వందమంది మృత్యువాత పడ్డారని ప్రభుత్వం చెబుతండగా.. ఈ వార్తా సంస్థ మాత్రం ఈ సంఖ్య వేయి దాకా వుండొచ్చని చెబుతోంది. వైరస్‌ కారణంగా గురువారం నాటికి ఇరాన్‌లో 7249 మంది మరణించారు. మే 20 నుంచి 24 గంటల్లో 2392 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన పడ్డారని తెలుస్తోంది.