హోం క్వారంటైన్‌పై ప్ర‌త్యేక నిఘా..రంగంలోకి విజిలెన్స్ స్క్వాడ్‌

దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 ర‌క్క‌సి కోర‌లు చాస్తోంది. మందు లేని మ‌హ‌మ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండ‌డంతో పిట్ట‌ల్లా ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలుచేస్తుంటే కొందరు హోం క్వారంటైన్‌లో ఉండాల్సినవారు బయట తిరుగుతున్నారు.

హోం క్వారంటైన్‌పై ప్ర‌త్యేక నిఘా..రంగంలోకి విజిలెన్స్ స్క్వాడ్‌
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 18, 2020 | 10:19 PM

దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 ర‌క్క‌సి కోర‌లు చాస్తోంది. మందు లేని మ‌హ‌మ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండ‌డంతో పిట్ట‌ల్లా ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలుచేస్తుంటే కొందరు హోం క్వారంటైన్‌లో ఉండాల్సినవారు బయట తిరుగుతున్నారు. కొందరు ఇలా చేయడంవల్ల ఇతరుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉండడమే కాకుండా కరోనా వ్యాప్తిని అదుపుచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషికి ఆశించినస్థాయిలో ప్రయోజనం ఉండడంలేదు. ఇటువంటి త‌రుణంలో బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక (బీబీఎంపీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
హోం క్వారంటైన్ ఉల్లంఘించిన వారి ఆట కట్టించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) 50 నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 15 మంది స‌భ్యులు ఉంటార‌ని, బీబీఎంపీ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించే వారిని తొలుత హెచ్చరిస్తామని, అయినప్పటికీ అదే పనిగా ఉల్లంఘిస్తే మాత్రం ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరించారు. అలాగే, వారిపై పోలీసు కేసు కూడా నమోదు చేస్తామని అనిల్ కుమార్ హెచ్చ‌రించారు.