తెలంగాణలో కరోనా విజృంభణ.. 6 వేలు దాటిన పాజిటివ్ కేసులు..

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో ఏకంగా రికార్డు స్థాయిలో 352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 6,027కి చేరింది.

తెలంగాణలో కరోనా విజృంభణ.. 6 వేలు దాటిన పాజిటివ్ కేసులు..
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 18, 2020 | 10:28 PM

తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా రికార్డు స్థాయిలో 352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 6,027కి చేరింది. ఇందులో 2,531 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,301 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇవాళ 230 మంది డిశ్చార్జ్ కాగా, ముగ్గురు కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 195 కరోనా మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా చూస్తే జనగాంలో 3, జయశంకర్ భూపాలపల్లిలో 2, మంచిర్యాలలో 4, నిజామాబాద్ లో 2, ఖమ్మం 1, మహబూబ్ నగర్ 2, మెదక్ 2, మేడ్చల్  10, రంగారెడ్డి 17, సంగారెడ్డి 2, నల్గొండ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ లో 1, వరంగల్ అర్బన్ లో 3 కేసులు నమోదయ్యాయి.

Also Read:

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!

సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!

దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..

బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..