Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Corona Updates: కరోనా సోకిన వ్యక్తి ఇంటికి 25 మీటర్ల పరిధిలోని ఇళ్లన్నీ సీజ్..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త మార్గదర్శకాలు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.

UP Corona Updates: కరోనా సోకిన వ్యక్తి ఇంటికి 25 మీటర్ల పరిధిలోని ఇళ్లన్నీ సీజ్..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త మార్గదర్శకాలు
Up Corona Updates
Follow us
Anil kumar poka

|

Updated on: Apr 05, 2021 | 6:27 PM

UP Corona Updates: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తుండటం.. రెండో వారంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు వాటికవే సొంత మార్గదర్శకాలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకత్వాలు విడుదల చేసింది. వీటి ప్రకారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తి ఇంటి చుట్టూ 25 మీటర్ల ప్రాంతాన్ని సీల్ చేయాలని నిర్ణయించింది. అదే ప్రాంతంలో కనుక మరో వ్యక్తికీ కరోనా సోకితే 50 మీటర్ల ప్రాంతం సీల్ చేస్తారు. 25 మీటర్ల ప్రాంతం అంటే 20 ఇళ్ళు..50 మీటర్ల పరిధి అంటే 60 ఇల్లు కనీసంగా వస్తాయని తెలిపింది.

ఇక చివరి పాజిటివ్ కేసు వచ్చిన దగ్గర నుంచి 14 రోజుల పాటు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా పరిగణించాలి. ఈ 14 రోజులల్లో ఒక్క కేసూ రాకపోతే కంటైన్మెంట్ జోన్ నుంచి బయట పడుతుంది.

కంటైన్మెంట్ జోన్లలో ఒక బృందం పర్యటించి కరోనా నివారణ చర్యల గురించి ఆ ప్రాంత ప్రజలకు తెలియచేస్తుంది. అక్కడ లక్షణాలు ఉన్న వారి వివరాలను జిల్లా నిఘా అధికారికి అందచేస్తుంది. అక్కడి నుంచి అది రాష్ట్ర వైద్య సిబ్బందికి వెళుతుంది. జిల్లా నిఘా అధికారి ఇచ్చే రోజు వారి సమాచారం ఆధారంగా కంటైన్మెంట్ జోన్ల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు.

ఉత్తరప్రదేశ్ లో తాజాగా 4,136 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది వారిలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:West Bengal Election 2021: మమతా గెలిస్తేనే మరింత అభివృద్ధి.. సినీనటి, ఎంపీ జయా బచ్చన్ కీలక వ్యాఖ్యలు

Mamata Banerjee: ఒంటి కాలుతో బెంగాల్‌ను, రెండు కాళ్లతో ఢిల్లీని గెలుస్తా: మమతా బెనర్జీ