కరోనా ఎఫెక్ట్.. “పాన్ మసాల”లపై బ్యాన్..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో.. యూపీ సర్కార్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మసాలా ఉత్పత్తికి సంబంధించిన అమ్మాకాలు.. పంపిణీలపై నిషేధం విధించింది. పాన్ మసాలాలు నమిలి ఉమ్మి వేయడం ద్వారా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న అనుమానాలతో.. వైద్యుల సూచన మేరకు.. ముందస్తు జాగ్రత్తగా వీటిపై నిషేధం విధించింది యోగీ సర్కార్. కాగా.. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య.. 500 మార్క్ […]

కరోనా ఎఫెక్ట్.. పాన్ మసాలలపై బ్యాన్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 25, 2020 | 8:52 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో.. యూపీ సర్కార్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మసాలా ఉత్పత్తికి సంబంధించిన అమ్మాకాలు.. పంపిణీలపై నిషేధం విధించింది. పాన్ మసాలాలు నమిలి ఉమ్మి వేయడం ద్వారా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న అనుమానాలతో.. వైద్యుల సూచన మేరకు.. ముందస్తు జాగ్రత్తగా వీటిపై నిషేధం విధించింది యోగీ సర్కార్.

కాగా.. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య.. 500 మార్క్ దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.