#India locked down కాశీలో తెలుగోళ్ళు.. ఎందుకెళ్ళారంటే?
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు తీర్థయాత్రలకని కాశీకి వెళ్ళి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. లాక్ డౌన్ ఎఫెక్టుతో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వారంతా అక్కడ్నిచి కదల్లేని పరిస్థితి నెలకొంది. వారం రోజులంటే ఎలాగోలా వుండేవారిమని, ఇపుడు 21 రోజుల పాటు కాశీలోనే హోటళ్ళలో వుండాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు వారంతా.
Telugu pilgrims struck in Kashi: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు తీర్థయాత్రలకని కాశీకి వెళ్ళి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. లాక్ డౌన్ ఎఫెక్టుతో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వారంతా అక్కడ్నిచి కదల్లేని పరిస్థితి నెలకొంది. వారం రోజులంటే ఎలాగోలా వుండేవారిమని, ఇపుడు 21 రోజుల పాటు కాశీలోనే హోటళ్ళలో వుండాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు వారంతా. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమను స్వస్థలాలకు చేర్చాలని వారు తెలుగు మీడియాకు వీడియో సందేశాలు పంపుతున్నారు.
తెలంగాణలోని యాదాద్రి, జనగామ ప్రాంతాలకు చెందిన సుమారు అరవై మంది మార్చి 16వ తేదీన కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం వారణాసి వెళ్ళారు. మార్చి 29వ తేదీ వరకు వారణాసితోపాటు సమీపంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ప్లాన్ చేశారు. ఈలోగా దేశంలో కరోనా ప్రభావం తీవ్రమవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సైతం లాక్ డౌన్‌ను పక్కాగా అమలు చేస్తోంది. మరోవైపు రైల్వే శాఖ రైళ్ళను, వాటితోపాటు జారీ చేసిన టిక్కెట్లను రద్దు చేసింది. కాశీలో వున్న తెలంగాణవాసుల రైల్వే టిక్కెట్లుకూడా రద్దు అయ్యాయి. ప్రస్తుతం కాశీలోని లష్కర్ రోడ్డు టెంపుల్ వీధి జస్ట్ లుక్ హోటల్ లో ఉంటున్న వీరిని అక్కడి అధికార యంత్రాంగం అడుగు కూడా బయటపెట్టని ఇవ్వడం లేదని తెలుస్తోంది.
ఈ అరవై సభ్యులు యాత్రీక బృందంలో ఎక్కువగా 60 సంవత్సరాలు నిండిన వృద్ధ మహిళలు, వృద్ధులు వుండడంతో వారంతా నాలుగు రోజులుగా హోటల్‌లో నిర్బంధంలో వుండిపోయారు తామంతా అస్వస్థతకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపి తమకు తమ స్వస్థలాలకు తరలించాలని వారు వేడుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు తమ వారి ఫోటోలు, వీడియోలు హైదరాబాద్‌లోని మీడియా హౌజులకు పంపుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని అర్థిస్తున్నారు.
మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన 25 మంది, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జిల్లాలకు చెందిన మరో ఏడుగురు కాశిలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిలో నెల్లూరుకు చెందిన 25 మంది మార్చి 13న తీర్థయాత్రలకని బయలుదేరి వెళ్ళారు. రెండు రోజుల క్రితం అంటే మార్చి 23న కాశికి చేరుకున్నారు. ఆ తర్వాత వరుసగా జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ విధింపు రావడంతో వారు అక్కడే వుండిపోవాల్సి వచ్చింది. తామంతా హోటళ్ళలోనే వుండిపోయామని, 21 రోజుల పాటు హోటల్లో వుండే పరిస్థితి లేదని, తమను తమ స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం చొరవ చూపాలని వారంతా కోరుతున్నారు.