కరోనా కట్టడికి లియోనల్ మెస్సీ భారీ విరాళం!

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ను అరికట్టడంలో భాగంగా ప్రముఖ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనల్ మెస్సీ రూ.8.27 కోట్ల ఆర్థిక సాయం చేశాడు. ఆ డబ్బుని స్పెయిన్‌లోని

కరోనా కట్టడికి లియోనల్ మెస్సీ భారీ విరాళం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 25, 2020 | 5:55 PM

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ను అరికట్టడంలో భాగంగా ప్రముఖ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనల్ మెస్సీ రూ.8.27 కోట్ల ఆర్థిక సాయం చేశాడు. ఆ డబ్బుని స్పెయిన్‌లోని బార్సిలోనాలోని హాస్పిటల్‌ క్లినిక్‌, తన సొంతదేశం అర్జెంటీనాలోని వైద్య కేంద్రం వినియోగించుకోనున్నాయి. ”కరోనాపై పోరాడేందుకు క్లినిక్‌కు సాయం చేసినందుకు మెస్సీకి కృతజ్ఞతలు” అని హాస్పిటల్ క్లినిక్‌ ట్వీట్‌ చేసింది.

స్పెయిన్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో బార్సిలోనా మేనేజర్‌, మాజీ ప్లేయర్ అయిన పెప్‌ గార్డియోలా కూడా అదే మొత్తంలో ఏంజెల్ సోలర్ డేనియల్ ఫౌండేషన్, బార్సిలోనా మెడికల్ కాలేజ్‌కు సాయం చేశాడు. ”కొవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవటానికి పెప్‌ గార్డియోలా ఆరోగ్య పరికరాల కోసం ఏంజెల్ సోలర్ డేనియల్ ఫౌండేషన్‌కు ఒక మిలియన్ యూరోలు సాయం చేశారు” అని మెడికల్‌ కాలేజ్‌ తెలిపింది.