AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హోంక్వారంటైన్ నిబంధ‌న‌లు’ జారీ చేసిన యూపీ సర్కార్

దేశవ్యాప్తంగా ఉగ్రరూపంతో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి..యూపీలోనూ ప్రతాపం చూపెడుతోంది. రాష్ట్రంలో వైరస్ తీవ్రత అంతకంతకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితుల కోసం హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాల‌ను జారీ చేసింది. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితుని ఇంటిలో కనీసం రెండు టాయిలెట్లు ఉంటేనే అత‌ను హోంక్వారంటైన్‌లో ఉండేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ..సర్కార్ ఆదేశాలు జారీ […]

‘హోంక్వారంటైన్ నిబంధ‌న‌లు’ జారీ చేసిన యూపీ సర్కార్
Jyothi Gadda
|

Updated on: Jul 21, 2020 | 1:52 PM

Share

దేశవ్యాప్తంగా ఉగ్రరూపంతో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి..యూపీలోనూ ప్రతాపం చూపెడుతోంది. రాష్ట్రంలో వైరస్ తీవ్రత అంతకంతకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితుల కోసం హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాల‌ను జారీ చేసింది.

హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితుని ఇంటిలో కనీసం రెండు టాయిలెట్లు ఉంటేనే అత‌ను హోంక్వారంటైన్‌లో ఉండేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ..సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండి, ఇతర వ్యాధులేవీ లేనివారు మాత్ర‌మే హోంక్వారంటైన్‌లో చికిత్స పొందేందుకు అనుమతించాలని యూపీ సర్కార్ మార్గదర్శకాలు సూచించింది.

కరోనా సోకిన బాధితుడు హోం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ..ఆ ఇంట్లో తప్పని సరిగా రెండు టాయిలెట్లు ఉంటేనే, ఆ కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉండ‌గలుగుతారని ప్రభుత్వం చెప్పింది. హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు బాధితులు తప్పని సరిగా తొలుత వైద్యుల అనుమతి తీసుకోవాలని నిర్ధేశించింది. ఇకపోతే, హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారు ప్ర‌భుత్వం సూచించిన‌ ప్రమాణాలను తప్పక పాటించాలని కోరింది. హెచ్‌ఐవి, అవయవ మార్పిడి, క్యాన్సర్ మొదలైన స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, అటువంటి కరోనా బాధితుల‌ను హోంక్వారంటైన్‌లో ఉండేందుకు అనుమ‌తించరాదని సూచించింది.

హోంఐసోలేషన్‌లో ఉంటున్న బాధితులు పల్స్ఆక్సీమీటర్, థర్మామీటర్, మాస్క్‌తో కూడుకున్న కిట్‌ను వారు కొనుగోలు చేసుకోవాలని, 24గంటల వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఏ మాత్రం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా అనిపించిన వెంటనే వైద్యులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా ఆరోగ్యసేతు యాప్‌ను తప్పక డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పింది.

Follow Us
పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఒక్క క్యారెట్‌తో పుట్టెడు లాభాలు..
పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఒక్క క్యారెట్‌తో పుట్టెడు లాభాలు..
ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. డబ్బు విత్‌డ్రాపై EPFO అప్‌డేట్‌
ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. డబ్బు విత్‌డ్రాపై EPFO అప్‌డేట్‌
తెలంగాణ స్టైల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరి పోతుంది!
తెలంగాణ స్టైల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరి పోతుంది!
చిలుక ముక్కు ఉన్నవారు కోటీశ్వరులు ఖాయమా? షాకింగ్ ఫాక్ట్స్
చిలుక ముక్కు ఉన్నవారు కోటీశ్వరులు ఖాయమా? షాకింగ్ ఫాక్ట్స్
పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టేనా?..
పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టేనా?..
టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఆయనే..: గంభీర్ షాకింగ్ కామెంట్స్..!
టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఆయనే..: గంభీర్ షాకింగ్ కామెంట్స్..!
నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు..!
నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు..!
కొక్కర వ్యాధితో వేలాది కోళ్ల మృత్యువాత.. ఇలాంటి లక్షణాలు డేంజర్
కొక్కర వ్యాధితో వేలాది కోళ్ల మృత్యువాత.. ఇలాంటి లక్షణాలు డేంజర్
ఈ 4 వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. డబ్బే డబ్బు!
ఈ 4 వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. డబ్బే డబ్బు!
ఏపీ పాలీసెట్ 2026కు ముగుస్తున్న గడువు.. మీరు దరఖాస్తు చేశారా?
ఏపీ పాలీసెట్ 2026కు ముగుస్తున్న గడువు.. మీరు దరఖాస్తు చేశారా?