దేశంలో కరోనా వ్యాప్తికి కారణం తబ్లీఘీనే.. మండిపడ్డ సీఎం..!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తొలుత కరోనా కేసులు దేశంలో అత్యల్పంగా నమోదైనా.. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ వ్యవహారం బయట పడ్డాక ఈ కేసులు అమాంతం పెరిగిపోయాయి. పలు రాష్ట్రాల్లో అయితే నమోదైన కేసుల్లో దాదాపు తొంభై శాతం తబ్లీఘీ జమాత్ వల్లేనంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కూడా తబ్లీఘీ వ్యవహారంపై ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి […]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తొలుత కరోనా కేసులు దేశంలో అత్యల్పంగా నమోదైనా.. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ వ్యవహారం బయట పడ్డాక ఈ కేసులు అమాంతం పెరిగిపోయాయి. పలు రాష్ట్రాల్లో అయితే నమోదైన కేసుల్లో దాదాపు తొంభై శాతం తబ్లీఘీ జమాత్ వల్లేనంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కూడా తబ్లీఘీ వ్యవహారంపై ఫైర్ అయ్యారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి జరగడానికి తబ్లీఘీ జమాత్ కారణమంటూ ఆరోపించారు. వీరంతా దేశ వ్యాప్తంగా వ్యాప్తిచెందడానికి కరోనా‘క్యారియర్స్’ గా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.తబ్లీఘీ జమాత్ ప్రవర్తించిన తీరుతోనే ఇప్పుడు కరోనా వ్యాప్తిచెందిందని.. వారు స్వచ్ఛందంగా వచ్చి ఉంటే.. కరోనా కాస్త నియంత్రణలోకి వచ్చేదన్నారు.అంతకాదు.. వీరు చేసిందంతా నేర పూరిత చర్యలంటూ అభివర్ణించారు. వారికి కరోనా సోకడమన్నది నేరం కాదని.. అయితే వచ్చింది చెప్పకుండా దాచిపెట్టడమన్నది మాత్రం నేరమేనని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.