తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న క‌రోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య‌

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్ డౌన్..

తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న క‌రోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య‌
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 8:15 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షలు మార్క్ దాటాయి. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 10,171 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కరోనాతో కొత్త‌గా 89 మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్​తో ఇప్పటివరకు రాష్ట్ర‌వ్యాప్తంగా 1,842 మంది చ‌నిపోయారు. రాష్ట్రంలో వ్యాధి నుంచి 1,20,464 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,654 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల వ్యవధిలో 62,938 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు మొత్తం 23.62 లక్షల మందికి కరోనా టెస్టులు చేసిన‌ట్టు ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త‌గా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1,270, అనంతపురంలో 1,100, చిత్తూరులో 980, నెల్లూరులో 941, విశాఖలో 852, గుంటూరులో 817, కడపలో 596, పశ్చిమగోదావరిలో 548, విజయనగరంలో 530, శ్రీకాకుళంలో 449, కృష్ణాలో 420, ప్రకాశం జిల్లాలో 337లో కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కి చేరింది. ఇందులో 21,417 యాక్టివ్ కేసులు ఉండగా.. 53,239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1136 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 601కి చేరింది.

నిన్న ఒక్క రోజే 23,495 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 5,66,984కి చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 532, రంగారెడ్డిలో 196, వరంగల్ అర్బన్ 142, మేడ్చల్ 136, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, గద్వాల్ 87, కామారెడ్డి 96, కరీంనగర్ 93, ఖమ్మం 85, నిజామాబాద్ 89, పెద్దపల్లి 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read More:

48 గంట‌లు అన్నీ బంద్‌.. పుట్ట‌ప‌ర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

నేడు, రేపు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..