తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న‌ కోవిడ్

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్ డౌన్..

తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న‌ కోవిడ్
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 9:13 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే.. గడిచిన 24 గంటల్లో 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 72 మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,753కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,516 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,09,975కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,99,332 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 82,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 1112, చిత్తూరులో 755, గుంటూరులో 152, తూర్పు గోదావరిలో 1351, గుంటూరులో 868, కడపలో 604, కృష్ణాలో 363, కర్నూలులొ 1285, నెల్లూరులో 788, ప్రకాశంలో 366, శ్రీకాకుళంలో 682, విశాఖలో 781, విజయనగరంలో 575, పశ్చిమ గోదావరిలో 798 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.

ఇక ప్ర‌స్తుతం తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కి చేరింది. ఇందులో 21,417 యాక్టివ్ కేసులు ఉండగా.. 53,239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1136 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 601కి చేరింది.

ఇక నిన్న ఒక్క రోజే 23,495 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 5,66,984కి చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 532, రంగారెడ్డిలో 196, వరంగల్ అర్బన్ 142, మేడ్చల్ 136, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, గద్వాల్ 87, కామారెడ్డి 96, కరీంనగర్ 93, ఖమ్మం 85, నిజామాబాద్ 89, పెద్దపల్లి 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read More:

అర‌కులో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు స‌తీమ‌ణి మృతి

కొత్తగా 13 మంది స‌బ్ క‌లెక్ట‌ర్‌ల‌ను నియ‌మించిన ఏపీ ప్ర‌భుత్వం