ఏపీ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరికి కరోనా !
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఏపీ రాజ్‌భవన్‌ని కూడా కోవిడ్ షేక్ చేస్తోంది. రాజ్‌భవన్‌కు చెంఇన నలుగురికి ఇప్పటికే వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఇప్పుడు మరో ఇద్దరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. ఏపీని కోవిడ్ మహమ్మారి వెంటాడుతోంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం 9 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా […]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఏపీ రాజ్‌భవన్‌ని కూడా కోవిడ్ షేక్ చేస్తోంది. రాజ్‌భవన్‌కు చెంఇన నలుగురికి ఇప్పటికే వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఇప్పుడు మరో ఇద్దరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది.
ఏపీని కోవిడ్ మహమ్మారి వెంటాడుతోంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం 9 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1,332కు చేరింది. వాటిలో 287 మంది రికవరీ అయి డిశ్చార్జి అయ్యారు. 31 మంది చనిపోయారు. అందువల్ల ఇప్పుడు కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 1014గా ఉంది. ఇదిలా ఉంటే, రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగితో పాటు, 108 అంబులెన్స్ డ్రైవరుకు కూడా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఇక ఇంతకుముందు గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఇద్దరు అటెండర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో రాజ్‌భవన్‌కు సంబంధించి మొత్తం ఆరుగురు కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.