వనపర్తి కానిస్టేబుల్ సస్పెండ్.. బాధితుడి ఇంటికి వెళ్లిన ఎస్పీ

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో బైక్‌పై కుమారిడితో కలిసి బయటకు వచ్చిన వ్యక్తిని చిన్నారి ఎదుటే చితకబాదిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఓ వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి..

వనపర్తి కానిస్టేబుల్ సస్పెండ్.. బాధితుడి ఇంటికి వెళ్లిన ఎస్పీ

Edited By:

Updated on: Apr 03, 2020 | 8:16 AM

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో బైక్‌పై కుమారిడితో కలిసి బయటకు వచ్చిన వ్యక్తిని చిన్నారి ఎదుటే చితకబాదిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఓ వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి.. మంత్రి కేటీఆర్, ఎస్పీ, డీజీపీలకు ట్యాగ్ చేశాడు. ఇది చూసిన కేటీఆర్.. ఆ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించిన జిల్లా ఎస్పీ అపూర్వ రావు.. ఈ ఘటనపై విచారణ చేసి, సంబంధిత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు. అంతేకాక, ఎస్పీ బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాసేపు ఆ బాలుడితో ముచ్చటించారు.

బుధవారం సాయంత్రం వనపర్తికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై తన కొడుకుతో బైక్‌పై రాకపోకలు సాగించాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని ఆపి లాక్‌డౌన్‌ సమయంలో బాలుడిని వెంట తీసుకెళ్లడం సరికాదని హెచ్చరించారు. అంతేకాక.. ఆ బైక్‌పై 14 పెండింగ్ చలాన్లు ఉన్నాయని, అవి కట్టాలని నిలదీశాడు. మాటామాటా పెరగడంతో ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కుమారుడి ముందే కిందపడేసి కొట్టాడు. కాగా ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాని హోంమంత్రిని, డీజీపీని కోరారు. దీనిపై స్పందించిన వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు వ్యక్తిపై దాడి చేసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.

ఇవి కూడా చదవండి: 

చైనాలో మళ్లీ అలజడి.. ఓ మహిళకు కరోనా

గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం

ప్రభాస్‌ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు

దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే

లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసుల సర్వే.. చదువులేనోళ్లే నయం

కరోనా బాధితులకు ‘ఫోన్ పే’ ఇన్సూరెన్స్..