‘బ్లీచింగ్’ తో కరోనా రోగులకు ఇంజెక్షన్’… ట్రంప్ ‘కొత్త ట్రీట్ మెంట్’ !

కరోనా రోగులకు డిస్ ఇన్ ఫెక్టెంట్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారానో, అల్ట్రా వయొలెట్ లేదా, శక్తిమంతమైన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారానో వారిలోని వైరస్ ని నాశనం చేయవచ్చా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు.

'బ్లీచింగ్' తో కరోనా రోగులకు ఇంజెక్షన్'... ట్రంప్ 'కొత్త ట్రీట్ మెంట్' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 24, 2020 | 5:14 PM

కరోనా రోగులకు డిస్ ఇన్ ఫెక్టెంట్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారానో, అల్ట్రా వయొలెట్ లేదా, శక్తిమంతమైన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారానో వారిలోని వైరస్ ని నాశనం చేయవచ్చా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు. క్లీనింగ్ రసాయనాలను రోగి శరీరంలోకి ఇంజెక్ట్ చేసే అవకాశం ఉందా అన్నారు. కరోనా రోగిపైకి అల్ట్రా వయొలెట్ కిరణాలను, లేదా సూర్య కాంతిని ప్రసరింపజేస్తే అది మంచి ప్రభావం చూపుతుందని, వైరస్ నశిస్తుందని సీనియర్ హోమ్ లాండ్ సెక్యూరిటీ అడ్వైజర్ విలియం బ్రియాన్ చేసిన ప్రకటన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనబడుతోంది. మనిషి లాలాజలం (సలీవా)  లోని తుంపరలు కరోనా వైరస్ ని 5  నిముషాల్లో నాశనం చేస్తాయన్న ఓ అధ్యయనాన్ని పురస్కరించుకుని బ్రియాన్ ఈ మాటలు అన్నారు. గురువారం వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. కొంతమంది శాస్త్రజ్ఞులు చేసిన టెస్టుల్లో వేడిమి, సూర్యరశ్మితో ఈ వైరస్ ని నశింపజేయవచ్చునని కనుగొన్నారని చెప్పారు. వేడిమి, తేమ ఈ రెండూ వైరస్ ని అణచివేస్తాయని వారు పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. తాను డాక్టర్ని కానని, తన ‘ట్రీట్ మెంట్’ ఫలితాలను ఇస్తుందా లేదా అన్నది చెప్పలేనని ఆయన అన్నారు.

అయితే ట్రంప్ చేసిన ప్రకటనను డాక్టర్ విన్ గుప్తా వంటి నిపుణులు కొట్టిపారేశారు. రోగి శరీరం పైకి అల్ట్రా వయొలెట్ కిరణాలను ప్రసరింపజేసినా లేదా రసాయనాలను వారికి ఇంజెక్ట్ చేసినా తీవ్రమైన దుష్పరిణామాలు ఉంటాయని విన్ గుప్తా హెచ్చరించారు. అసలీ అభిప్రాయమే బాధ్యతారాహిత్యమైనదని, ప్రమాదకరమైనదని ఆయన చెప్పారు. ‘వైట్ హౌస్’ ఇలాంటి డేంజరస్ ఐడియాలు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. ట్రంప్ అశాస్త్రీయమైన చికిత్సా విధానాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కూడా ఆయన ఈసడించారు.