మరో మూడు కోట్ల సాయం ప్రకటించిన ప్రభాస్..

టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ తాజాగా ప్రధాని సహాయ నిధికి మరో మూడు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. దీంతో మొత్తం ప్రభాస్ ప్రకటించిన విరాళం నాలుగు కోట్లకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు..

మరో మూడు కోట్ల సాయం ప్రకటించిన ప్రభాస్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 27, 2020 | 7:19 AM

టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ తాజాగా ప్రధాని సహాయ నిధికి మరో మూడు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. దీంతో మొత్తం ప్రభాస్ ప్రకటించిన విరాళం నాలుగు కోట్లకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. కాగా ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు, క్రీడాకారులు కూడా తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో గత 10 రోజులుగా సూటింగ్‌లు ఆగిపోవడం వల్ల ఇండస్ట్రీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కూడా సహాయం అందించేందుకు సెలబ్రిటీలు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, నితిన్, తివిక్రమ్, దిల్ రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటివారు తమ వంతు సహాయాన్ని అందించారు. ఇక అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ రెండు సార్లు సాయం ప్రకటించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: 

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్