Breaking News
  • మధ్యప్రదేశ్ లో ఒకే ఇంట్లో 8 మందికి కరోనా పాజిటివ్. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా లో ఒకే ఫ్యామిలీ లో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడి. గతం లో ఒక ఇంటి సభ్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెల్లడించిన అధికారులు. అన్ని కూడా కాంటాక్ట్ కేస్ లు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • చెన్నై విలుపురంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఐసోలేషన్ వార్డు నుండి పరారీ. గతనెలలో విలుపురం వచ్చిన ఢిల్లీకి చెందిన వ్యక్తి. కరోనా పాజిటివ్ తెలియగానే కలెక్టరేట్ లో‌ని ఐసోలేషన్ వార్డు నిండి పరారీ. ఆ వ్యక్తి ఆచూకి తెలపాలంటూ పోటో విడుదల చేసిన పోలీసులు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ. విద్యుత్ సంస్థలు రీలివ్ చేసిన ఉద్యోగుల జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతపై సుప్రీంకోర్టులో అప్లికేషన్ వేసిన ధర్మాధికారి కమిటీ. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు .

కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట

కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు ప్రముఖ హీరో కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చికిత్స అందించేందుకు తన ఇంటినే ఆస్పత్రిగా మార్చాలనకుంటున్నట్లు..
Coronavirus Effect: Super Star Kamal Haasan Announces that Ready to change his Home as Hospital, కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట

చాప కింద నీరులాగా కరోనా వైరస్.. దేశ వ్యాప్తంగా ప్రబలుతోన్న విషయం తెలిసిందే. దీన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 500లకి పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే 11 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు ప్రముఖ హీరో కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చికిత్స అందించేందుకు తన ఇంటినే ఆస్పత్రిగా మార్చాలనకుంటున్నట్లు ప్రకటించారు. తన పార్టీ నేతలతో(మక్కల్ నీది మయ్యం) కలిసి వైద్యులతో మాట్లాడి, మార్చాలనకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు సేవలు అందించేందుకు ఇదే మార్గమని భావిస్తున్నట్టు తెలిపారు.

కాగా మరోవైపు షూటింగులు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమలోని పేద కళాకారులను ఆదుకునేందుకు కమల్ రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించగా, రజనీకాంత్ ఇప్పటికే రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే ధనుష్ రూ.15 లక్షలు, డైరెక్టర్ శంకర్ రూ.10 లక్షలు, విజయ్‌ సేతుపతి రూ.10 లక్షలు, శివ కార్తికేయన్ రూ.10 లక్షలతో పాటు 100 బస్తాల బియ్యం, నిర్మాత దిల్లీ బాబు 20 బస్తాల బియ్యం చొప్పున విరాళంగా అందించారు. అలాగే నటుడు మనీష్ కాంత్ 40 కిలోల పప్పుదినుసులు, తమిళ సినిమా జర్నలిస్టు డైలీస్ అసోసియేషన్ తరుపున 100 కిలోల బియ్యం చొప్పున అందజేశారు.

ఇవి కూడా చదవండి: 

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..

Related Tags