లాక్‌డౌన్ సమయంలోనూ ఏమాత్రం తగ్గని తిరుమల శ్రీవారి ఆదాయం..

లాక్‌డౌన్‌ సమయంలోనూ తిరుమల తిరుపతి శ్రీవారి ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. ఆన్‌లైన్ ద్వారా శ్రీవారికి తమ కానుకలను పంపిస్తున్నారు భక్తులు. గతేడాది ఏప్రిల్‌లో ఆన్‌లైన్ ద్వారా రూ.90 లక్షల ఆదాయం..

  • Tv9 Telugu
  • Publish Date - 9:50 am, Tue, 19 May 20
లాక్‌డౌన్ సమయంలోనూ ఏమాత్రం తగ్గని తిరుమల శ్రీవారి ఆదాయం..

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు పరుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్నీ మూతపడ్డాయి. అందులో భాగంగా పలు ఆలయాల్లో కూడా భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ముఖ్యంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దర్శనాలు నిలిచిపోయాయి. అయితే స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, సేవలు యాథావిథిగా కొనసాగుతున్నా.. భక్తులకు మాత్రం దర్శన భాగ్యం లేదు. దీంతో స్వామివారికి కొండకు వచ్చే భక్తులు లేరు. హుండీల్లో కానుకలు సమర్పించే భక్తులు కూడా లేకుండా పోయారు.

కానీ లాక్‌డౌన్‌ సమయంలోనూ తిరుమల తిరుపతి శ్రీవారి ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. ఆన్‌లైన్ ద్వారా శ్రీవారికి తమ కానుకలను పంపిస్తున్నారు భక్తులు. గతేడాది ఏప్రిల్‌లో ఆన్‌లైన్ ద్వారా రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఏప్రిల్‌లో నమోదైన హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంది. కరోనా లాక్‌డౌన్‌తో 59 రోజుల పాటు శ్రీవారికి భక్తులు దూరమైనా.. కానుకలు మాత్రం ఆన్‌లైన్ హుండీ ద్వారా పంపుతున్నారు. ఈ సమయంలోనూ భక్తులు శ్రీ వెంకటేశ్వరుడికి ఆన్‌లైన్ కానుకలు సమర్పించి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు.

ఇది కూడా చదవండి: 

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

క్వారంటైన్‌లో ఉన్న యువకుడి ఆత్మహత్య.. కారణం ఇదే!