ఆన్‌లైన్‌లో శ్రీవారి ‘బ్రేక్ దర్శనం’ టికెట్లు

తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్‌లో ఉంచింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా  ఈ టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది దేవస్థానం....

ఆన్‌లైన్‌లో శ్రీవారి 'బ్రేక్ దర్శనం' టికెట్లు
జులై మాసంలో 7.13 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Follow us

|

Updated on: Jun 23, 2020 | 3:05 PM

తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్‌లో ఉంచింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా  ఈ టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది దేవస్థానం. ఈ టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది.

శ్రీవాణి ట్రస్టుకు విరాళమిచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్ల కోటాను టీటీడీ(జూన్ 23) మంగళవారం విడుదల చేసింది. భక్తుడు రూ.10,000వేలను శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా ఇస్తే  ఒక్క వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్టును రూ.500 దేవస్థానం కేటాయించనుంది.

ఈ నెల 24 నుంచి 30 వరకు బ్రేక్ దర్శనం టిక్కెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తిరుమల జేఈవో కార్యాలయంలో కూడా శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. జూన్ 30 వరకు ఆన్‌లైన్‌లో కోటాను టీటీడీ విడుదల చేసింది.