AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మందులు ‘గేమ్ ఛేంజర్స్’ అని చెప్పలేం.. యాంటీ వైరల్ డ్రగ్స్ పై నిపుణుల పెదవివిరుపు

కోవిడ్-19   ట్రీట్ మెంట్ కోసం రెమ్ డెసివిర్, ఫెవిపైరవిర్ జెనెరిక్ మందులను ఔషధ కంపెనీలు లాంచ్ చేయడం ఈ వైరస్ పై జరిపేపోరులో సానుకూల పరిణామమేనని మిఫుణులు పేర్కొన్నారు. అయితే ఈ యాంటీ వైరల్ డ్రగ్స్ అని ‘గేమ్ ఛేంజర్స్’ గా ఇప్పుడే చెప్పలేమని వారు పెదవి విరిచారు. ఫెవిపైరవిర్ మందును గ్లెన్ మార్క్ కంపెనీ..’ఫ్యాబీ ఫ్లూ’ అనే బ్రాండ్ పేరిట లాంచ్ చేయగా.. సిప్లా , హెటిరో సంస్థలు రెమ్ డెసివిర్ మందును వేర్వేరు బ్రాండ్ల […]

ఆ మందులు 'గేమ్ ఛేంజర్స్' అని చెప్పలేం.. యాంటీ వైరల్ డ్రగ్స్ పై నిపుణుల పెదవివిరుపు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 23, 2020 | 3:20 PM

Share

కోవిడ్-19   ట్రీట్ మెంట్ కోసం రెమ్ డెసివిర్, ఫెవిపైరవిర్ జెనెరిక్ మందులను ఔషధ కంపెనీలు లాంచ్ చేయడం ఈ వైరస్ పై జరిపేపోరులో సానుకూల పరిణామమేనని మిఫుణులు పేర్కొన్నారు. అయితే ఈ యాంటీ వైరల్ డ్రగ్స్ అని ‘గేమ్ ఛేంజర్స్’ గా ఇప్పుడే చెప్పలేమని వారు పెదవి విరిచారు. ఫెవిపైరవిర్ మందును గ్లెన్ మార్క్ కంపెనీ..’ఫ్యాబీ ఫ్లూ’ అనే బ్రాండ్ పేరిట లాంచ్ చేయగా.. సిప్లా , హెటిరో సంస్థలు రెమ్ డెసివిర్ మందును వేర్వేరు బ్రాండ్ల పేరిట విడుదల చేశాయి. సిప్లా కంపెనీ దీన్ని ‘సిప్రెమీ’ పేరిట, హెటిరో…’కోవిఫర్’ బ్రాండ్ పేరిట రిలీజ్ చేశాయి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి వీటికి ఆమోదం లభించింది.

అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ పై పోరుకు అనువైన  ట్రీట్ మెంట్ గానీ, వ్యాక్సీన్ గానీ కనుగొనలేకపోయామని ఢిల్లీ ఎయిమ్స్ లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు. ఈ వైరస్ కు ఇది ఖఛ్చితంగా పని చేసే మందు అని చెప్పడానికి ఆధారాలు లేవు అని ఆయన పేర్కొన్నారు. అందువల్లే.. అప్పటివరకు ఏ మందునైనా ‘గేమ్ చేంజర్’ గా చెప్పలేమన్నారు. ఈ మెడిసిన్స్ ఎంతవరకు పని చేస్తాయన్నది భవిష్యత్తే నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. అసలివి కోవిడ్-19 కి ‘సపోర్టివ్’ గా ఉంటాయా అన్నది కూడా తెలియదన్నారు. డాక్టర్ వికాస్ మౌర్య, డాక్టర్ అరవింద్ కుమార్ అనే నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీటిని ఇతర చికిత్సలకు కూడా వినియోగిస్తున్న విషయాన్ని విస్మరించరాదని వీరు పేర్కొన్నారు. ఈ మెడిసిన్స్ వైరల్ లోడ్ ని తగ్గించడంలో తోడ్పడతాయని.. కానీ గేమ్ చేంజర్స్ కావని వీరు తేల్చేశారు. ఏమైతేనేం.. వీటిని లాంచ్ చేయడం శుభ పరిణామమే అని తమకు తాము సంతృప్తి పడ్డారు.

Follow Us
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..
ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..