ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లకు కరోనా పాజిటివ్

ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లకు కరోనా పాజిటివ్

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి జ‌డ‌లు విప్పుకుంటోంది. వైరస్ కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ప్ర‌స్తుతం దేశంలో 74,281 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,525 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోదు కాగా, 122 మంది చ‌నిపోయారు. 47, 480 మంది బాధితులు ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. 24, 386 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 2,415 మంది క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందారు. కాగా, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు […]

Jyothi Gadda

|

May 13, 2020 | 1:13 PM

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి జ‌డ‌లు విప్పుకుంటోంది. వైరస్ కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ప్ర‌స్తుతం దేశంలో 74,281 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,525 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోదు కాగా, 122 మంది చ‌నిపోయారు. 47, 480 మంది బాధితులు ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. 24, 386 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 2,415 మంది క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందారు.

కాగా, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోదు అవుతుండ‌గా త‌మిళ‌నాడులో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,718కి చేరింది. తమిళనాడులో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 716 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒక్క చెన్నైలోనే 500 కేసులు రాగా.. తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,718కి చేరింది. మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 61కి చేరాయి.

ఒక్క చెన్నై నగరంలోనే 4,888 మంది వైరస్ బారినపడ్డారు. తాజాగా, చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహమ్మారి వైరస్ బారినపడ్డారు. వీరిలో ఓ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నారు. ఈయన ఇటీవల కోయంబేడు మార్కెట్‌లోని సీడీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఆయనకు వైరస్ సోకింది. డీసీపీ, ఏసీపీస్థాయి అధికారులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కోవిడ్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 190కి పెరిగింది. చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కూడా కరోనా బారినపడ్డారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu