AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగల షాపులో పని చేస్తున్న సిబ్బందిలో 31 మందికి కరోనా పాజిటివ్‌

కరోనా వైరస్‌ ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.. అక్కడా ఇక్కడా అని లేదు.. అంతటా కరోనా ఉంటోంది..

నగల షాపులో పని చేస్తున్న సిబ్బందిలో 31 మందికి కరోనా పాజిటివ్‌
Balu
|

Updated on: Nov 20, 2020 | 11:29 AM

Share

కరోనా వైరస్‌ ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.. అక్కడా ఇక్కడా అని లేదు.. అంతటా కరోనా ఉంటోంది.. మధ్యప్రదేశ్‌లో అయితే ప్రజల నిర్లక్ష్యం కారణంగా కేసులు పెరుగుతున్నాయి.. ఇండోర్ పట్టణంలోని ఓ నగల షాపులో పని చేసే 31 మంది సిబ్బందికి కరోనా సోకింది.. అధికారులు వెంటనే ఆ షాపును మూసేశారు.. అంతేకాదు.. గత వారం రోజులుగా ఈ షాపుకు వచ్చిన వినియోగదారులను గుర్తించే పనిలో పడ్డారు.. మిగతా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు.. షాపుకు వచ్చిన వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు వుంటే వెంటనే తమకు తెలియచేయాలని అధికారులు చెప్పారు. నగల షాపును పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నారు. పరిస్థితి కుదుటపడిన తర్వాతే షాపును తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు. ధన్‌తేరాస్‌ రోజున షాపు వినియోగదారులతో కిటకిటలాడిందట! ఆ తర్వాత దీపావళి రోజున కూడా అదే పరిస్థితి నెలకొన్నదట! ఈ రద్దీ కారణంగానే కరోనా అంతమందికి అంటుకుని ఉంటుందని అధికారులు అంటున్నారు. పండుగ రోజున నగలు కొనాలని ఉంటుంది కానీ ఇలా కోవిడ్‌ -19 నిబంధనలు పక్కన పెట్టేసి జనం రావడమే అనర్థానికి కారణమని చెబుతున్నారు. ఎవరూ మాస్క్‌లు పెట్టుకోవడం లేదట! భౌతిక దూరాన్ని పాటించడం లేదట! ఇలా అయితే ఒకే దుకాణంలో ఇంత మంది సిబ్బందికి కొవిడ్‌ సోకడం ఆశ్చర్యమేమి లేదు!

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!