కోవిడ్ నుంచి కోలుకున్న హోంమంత్రి, కుటుంబ సభ్యులు

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో మంత్రి మహమూద్ అలీకి కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు తన కుమారుడు, మనవడు కూడా కరోనా బారిన పడగా...

కోవిడ్ నుంచి కోలుకున్న హోంమంత్రి, కుటుంబ సభ్యులు
Follow us

|

Updated on: Jul 03, 2020 | 6:13 PM

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో మంత్రి మహమూద్ అలీకి కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు తన కుమారుడు, మనవడు కూడా శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం మంత్రికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా..రిజల్ట్స్‌లో పాజిటివ్‌గా తేలింది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కరోనా బారినపడిన ఆయన కుటుంబ సభ్యులు కూడా కోలుకుని ఇవాళే డిశ్చార్జ్ అయ్యారు. మేం త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆయన సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కరోనా వైరస్‌ను జయించారు. 71 ఏళ్ల వీహెచ్‌కు షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ పది రోజుల్లోనే కోవిడ్ నుంచి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో జూన్ 21న వీహెచ్ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఆయన భార్యకు కోవిడ్ టెస్టులు చేయగా ఆమెకు కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కూడా అపోలో హాస్పిటల్‌లోనే చేరారు. వీహెచ్ భార్య కూడా కరోనా నుంచి కోలుకున్నారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..