బ్రేకింగ్: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా..

ఇప్పటికే ఏపీలో పలువురు నేతలకు కరోనా వైరస్ సోకగా.. తాజాగా ఈ మహమ్మారి బారిన మరో వైసీపీ ఎమ్మెల్యే పడ్డారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  • Ravi Kiran
  • Publish Date - 6:20 pm, Fri, 3 July 20
బ్రేకింగ్: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా..

Coronavirus In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దశలవారీ లాక్‌డౌన్ ముగియడం.. అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు..  ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఇలా అందరికీ కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ఏపీలో పలువురు నేతలకు కరోనా వైరస్ సోకగా.. తాజాగా ఈ మహమ్మారి బారిన మరో వైసీపీ ఎమ్మెల్యే పడ్డారు.

పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన కలెక్టరేట్‌లో ఓ సమావేశానికి హాజరు కాగా.. అదే మీటింగ్‌లో పాల్గొన్న హోంమంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. కాగా, ఇప్పటికే ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి కరోనా వైరస్ సోకిన సంగతి విదితమే.

Also Read: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!