బిగ్ బ్రేకింగ్: జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్

కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించింది తెలంగాణ ప్రభుత్వం. జూన్‌ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించింది. కాగా ఈ లాక్‌డౌన్ కంటైన్మెంట్ జోన్లకే లాక్‌డౌన్‌ 5.0 వర్తింపజేస్తున్నట్లు నిర్ణయం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ప్యూ..

  • Tv9 Telugu
  • Publish Date - 4:25 pm, Sun, 31 May 20
బిగ్ బ్రేకింగ్: జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్

కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించింది తెలంగాణ ప్రభుత్వం. జూన్‌ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించింది. కాగా ఈ లాక్‌డౌన్ కంటైన్మెంట్ జోన్లకే లాక్‌డౌన్‌ 5.0 వర్తింపజేస్తున్నట్లు నిర్ణయం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ప్యూ విధించింది. అలాగే అంతరాష్ట్ర రాకపోకలపై నిషేదం ఎత్తివేసింది తెలంగాణ సర్కార్. కాగా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే పలు సడలింపులు చేసింది. ఇప్పటివరకూ రాష్ట్రంలోని అన్ని రకాల షాపులు సాయంత్రం 5 గంటలవరకు మాత్రమే ఓపెన్ ఉండేవి. అయితే లాక్‌డౌన్ 5.0 ప్రకారం రాత్రి 8 గంటల వరకూ షాపులు తెరిచి ఉంచుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో.. రెస్టారెంట్లు, మాల్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా సినిమా షూటింగ్స్ అనుమతికి సంబంధించి కూడా ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇది కూడా చదవండి:

షాకింగ్: 2,416 మంది పోలీసులకు కరోనా వైరస్..

బికినీ, లిప్‌లాక్‌ సీన్లపై కీర్తి కామెంట్స్..

ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ..