Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఉన్నతాధికారులు సీరియస్. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఏవిధంగా ప్రభుత్వానికి విక్రయించారంటూ ఆరా తీస్తున్న అధికారులు. ఇప్పటికే ప్రారంభమయిన పోలీసు దర్యాప్తు.
  • విజయవాడ: ఆత్రేయపురం ప్రేమకథ సినిమా పేరుతో మోసం. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ యువతులకు వల. అమరావతి శివక్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బన్ కటింగ్ చేసిన గుంటూరు జిల్లాకు చెందిన రెంవత్ బిక్షా . విజయవాడ, గుంటూరు జిల్లాకు చెందిన యువతులను హీరోయిన్లుగా చేస్తానంటూ చీటింగ్.
  • తూ. గో.జిల్లా కాకినాడ.. కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ప్రకటించిన వీడియో కన్ఫరెన్సింగ్ సొల్యూషన్ ఛాలెంజ్ లో ఎంపికయిన ఆంద్రప్రదేశ్ కు చెందిన వంశీ. ఆదిత్య కాలేజ్ విద్యార్థి వంశీ కురమా కి జాతీయ స్థాయి గుర్తింపు. అమెరికన్ యాప్ జూమ్ అప్ కు ప్రత్యామ్నాయం గా లిబిరో అనే భారతీయ యాప్ ను రూపొందించిన వంశీ.
  • విజయనగరం జిల్లాలో దారుణం. సీతానగరం మండలం నిడగల్లు లో కన్నకూతురు పై తండ్రి అత్యాచారం. గత కొన్నినెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న తండ్రి. తండ్రి ను కాపాడాలని పోలీసులకు వీడియో వాయిస్ పంపిన కూతురు. రంగంలోకి దిగిన పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • హైదరాబాద్ లో మాయమైన సండే సందడి. చాలా ఏరియా లలో కనిపిస్తున్న కర్ఫ్యూ వాతావరణం . షాపులు...మాల్స్ ..రెస్టారెంట్లు..తెరిచి ఉన్నా కన్పిపించని పబ్లిక్. ఆదివారం మార్కెట్ లలో సైతం అనంతం మాత్రం గానే కొనుగోలుదారు. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న కరోనా భయం. ఇళ్లకే పరిమితం అవుతున్న జనం. హైదరాబాద్ లో పెరుగుతున్న అధిక కేసులతో ... అలర్ట్ అయిన పబ్లిక్.
  • రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న అంతర్గత విబేధాలు. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్య తారాస్థాయికి చేరుకున్న విభేదాలు . గెహ్లాట్ తీరుపై సచిన్ పైలెట్ అసంతృప్తి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేసేందుకు తన వర్గం శాసన సభ్యులతో ఢిల్లీ పయనం.

బికినీ, లిప్‌లాక్‌ సీన్లపై కీర్తి కామెంట్స్..

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది నటి కీర్తి సురేష్. ఇక 'మహానటి' సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా ఆకాశానికి వెళ్లింది. అయితే ఇటీవల కీర్తి బికినీ, లిప్‌లాక్ సన్నివేశాలపై పలు కామెంట్స్ చేసింది. అలాగే ఇటీవలే అందుకు సంబంధించి వచ్చిన సినిమాలు కూడా రిజెక్ట్ చేసిందని..
Actress Keerthy suresh talks about hot roles and lip lock scenes, బికినీ, లిప్‌లాక్‌ సీన్లపై కీర్తి కామెంట్స్..

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది నటి కీర్తి సురేష్. ఇక ‘మహానటి’ సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా ఆకాశానికి వెళ్లింది. అయితే ఇటీవల కీర్తి బికినీ, లిప్‌లాక్ సన్నివేశాలపై పలు కామెంట్స్ చేసింది. అలాగే ఇటీవలే అందుకు సంబంధించి వచ్చిన సినిమాలు కూడా రిజెక్ట్ చేసిందని సమాచారం. వాటిపై తాజాగా కీర్తి వివరణ కూడా ఇచ్చింది. అలాంటి వాటికి దూరంగా ఉండడానికి ఓ కారణం ఉందని ఇటీవలే క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ .

పెద్దగా గ్లామర్ ప్రజెంటేషన్ లేకపోయినా కూడా కీర్తి పెద్ద సినిమాల్లో ఈజీగా అవకాశాలు అందుకుంటోంది. హాట్ రోల్స్ ఎన్ని వచ్చినా రిజెక్ట్ చేస్తోంది. గ్లామర్ గీత దాటకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. అలాంటి ఆఫర్స్‌ని రిజెక్ట్ చేయడానికి ఒక బలమైన కారణం ఉందంటోంది కీర్తి. అయితే అది భయంతో కాదంటూ.. ఎక్కడైనా సరే మన ఆలోచనలను బట్టి మనసు చెప్పింది వినాలి. ఓ విధంగా అలాంటి సన్నివేశాల్లో నటించడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని అంటోంది. అలాగే ఆడియన్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని చెబుతోంది.

‘మహానటి’ సినిమా తరువాత ఆడియన్స్ నన్ను ఒక హీరోయిన్‌గా కాకుండా ఒక మంచి నటిగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను హాట్ రోల్స్, లిప్ లాక్, బికినీ వంటి సీన్స్‌లో కనిపించడం ఆడియన్స్‌ని ఎంతమాత్రం నచ్చదని అనుకుంటున్నా. మెయిన్‌గా అలాంటి పాత్రలు తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతోంది కీర్తి.

ఇది కూడా చదవండి:

ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ..

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?

Related Tags