AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. సూసైడ్‌ చేసుకున్న తబ్లీఘీ జమాత్‌ సభ్యుడు.. కారణం ఇదేనా..?

ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్ మీటింగ్‌ల గురించి తెలిసిందే. తబ్లిఘీ జమాత్ ఇక్కడ మతపరమైన సమావేశం ఏర్పాటు చేయడంతో.. దేశంలోని పలు రాష్ట్రాల నుంచే కాకుండా.. వివిద దేశాల నుంచి కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ తేలడంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకు కారణం.. ఆ సమావేశానికి హాజరైన సభ్యులు.. వారి వారి స్వస్థలాలకు ప్రజా రవాణాలో వెళ్లడమే. అయితే వీరిలో కొందరికి ఈ కరోనా పాజిటివ్ ఉందన్న విషయం […]

షాకింగ్.. సూసైడ్‌ చేసుకున్న తబ్లీఘీ జమాత్‌ సభ్యుడు.. కారణం ఇదేనా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 11, 2020 | 4:44 PM

Share

ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్ మీటింగ్‌ల గురించి తెలిసిందే. తబ్లిఘీ జమాత్ ఇక్కడ మతపరమైన సమావేశం ఏర్పాటు చేయడంతో.. దేశంలోని పలు రాష్ట్రాల నుంచే కాకుండా.. వివిద దేశాల నుంచి కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ తేలడంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకు కారణం.. ఆ సమావేశానికి హాజరైన సభ్యులు.. వారి వారి స్వస్థలాలకు ప్రజా రవాణాలో వెళ్లడమే. అయితే వీరిలో కొందరికి ఈ కరోనా పాజిటివ్ ఉందన్న విషయం తెలియడంతోనే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి. వెంటనే ఆ సమావేశాలకు వెళ్లిన వారి గురించి గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో పలువురు తబ్లీఘీ సభ్యులు.. ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లారు. పలు మసీదుల్లో వీరి దొరకడంతో.. వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఓ తబ్లీఘీ జమాత్‌ సభ్యుడు అకోలా ఆస్పత్రిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం కరోనా టెస్టులు చేయడంతో.. అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో శనివారం ఉదయం ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

కాగా..మృతుడు అసోం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. అయితే ఢిల్లీలో తబ్లీఘీ సమావేశాల అనంతరం.. మరో తబ్లీగీ సభ్యుడితో అకోలా ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us
రైలులో ఫోన్ దొంగిలిద్దాం అనుకున్నాడు..ఆ తర్వాత ఏమైందంటే..
రైలులో ఫోన్ దొంగిలిద్దాం అనుకున్నాడు..ఆ తర్వాత ఏమైందంటే..
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?