అగ్రరాజ్యంలో ఆకలి కేకలు.. ఫుడ్ కోసం ఆరువేల కుటుంబాలు.. బారులు తీరిన వేలాది కార్లు

ప్రపంచ దేశాల్లో అత్యధిక ధనిక దేశాల్లో ఒకటైన అమెరికా ఇప్పుడు కరోనా కరాళ నృత్యంతో అల్లలాడుతోంది.. దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణిస్తుండగా..పచ్చని డాలర్ల కరెన్సీ కంటికి కనబడడమే మృగ్యం కాగా.. చిన్న, మధ్య , బడా తరగతుల కుటుంబాలు ఆకలితో అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నాయి.

అగ్రరాజ్యంలో ఆకలి కేకలు.. ఫుడ్ కోసం ఆరువేల కుటుంబాలు.. బారులు తీరిన వేలాది కార్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 10, 2020 | 5:55 PM

ప్రపంచ దేశాల్లో అత్యధిక ధనిక దేశాల్లో ఒకటైన అమెరికా ఇప్పుడు కరోనా కరాళ నృత్యంతో అల్లలాడుతోంది.. దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణిస్తుండగా..పచ్చని డాలర్ల కరెన్సీ కంటికి కనబడడమే మృగ్యం కాగా.. చిన్న, మధ్య , బడా తరగతుల కుటుంబాలు ఆకలితో అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నాయి. మనమెన్నడూ చూడని దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఉదాహరణకు టెక్సాస్ లోని శాన్ ఆంటోనియో ప్రాంతంలో గల ఓ ఫుడ్ బ్యాంక్ వద్ద బారులు తీరిన వేలాది కార్లే ఇందుకు నిదర్శనం. దాదాపు ఆరు వేల కుటుంబాలు ఇక్కడ.. ఈ ఆహార కేంద్రం వద్ద బుధవారం అర్దరాత్రి నుంచే పడిగాపులు కాస్తూ గురువారం సాయంత్రం వరకు నిరీక్షించాయి. ఎందుకో కాదు. తాము తినే బ్రెడ్, బటర్, ఛీజ్, ఇతర డెయిరీ ప్రాడక్ట్స్ కోసం గంటల కొద్దీ వెయిట్ చేశాయి. సుమారు 10 లక్లల ఫుడ్ పాకెట్లు, బాక్సులను ఫుడ్ బ్యాంక్ సిబ్బంది ఈ కుటుంబాలకు అందజేశారు. ఇవి ఈ ‘బాధితులకు’ ఈ నెలాఖరు వరకు సరిపోతాయట.. నిజానికి తాము ఇన్ని వేల కుటుంబాలు వస్తాయని భావించలేదని, దేశంలో ఆహార కొరత తీవ్రమవుతోందనడానికి వీరి ఆదుర్దా, గంటలకొద్దీ వీరి నిరీక్షణే నిదర్శనమని ఈ ఆహార కేంద్రం నిర్వాహకులు అన్నారు. తమ సిబ్బంది నిర్విరామంగా ఈ ఆహార ప్యాకెట్లను ఈ కుటుంబాలకు అందజేశారని వారు చెప్పారు. దివాంగులైన ఓ జంట తమ వంతు ప్యాకెట్లు తీసుకోవడానికి 12 గంటలు వెయిట్ చేశారట. ఇలాంటి పరిస్థితి వస్తుందని తామెన్నడూ అనుకోలేదని వారు వాపోయారు.