క‌రీంన‌గ‌ర్‌లో వింత ఘ‌ట‌న‌…పోలీస్‌ స్టేషన్‌లోనే చోరీ

ఇళ్ల‌లోనో, దుకాణాల్లోనూ చోరీలు జరిగితే పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాం..కానీ, అదే పోలీస్ స్టేష‌న్‌లో దొంగ‌లు ప‌డితే ఎవ‌రికీ చెప్పుకుంటారు..అక్క‌డ ఏకంగా ఓ పోలీస్ స్టేషన్‌లోనే దొంగ‌త‌నం జ‌రిగింది. నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అదికూడా మద్యమే దొంగిలించడం గమనార్హం. వివ‌రాల్లోకి వెళితే… లాక్ డౌన్ సమయంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై దాడులు చేసిన పోలీసులు సరకును సీజ్ చేశారు. దాన్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అయితే, పోలీస్ స్టేషన్‌లో […]

క‌రీంన‌గ‌ర్‌లో వింత ఘ‌ట‌న‌...పోలీస్‌ స్టేషన్‌లోనే చోరీ
Follow us

|

Updated on: May 06, 2020 | 4:23 PM

ఇళ్ల‌లోనో, దుకాణాల్లోనూ చోరీలు జరిగితే పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాం..కానీ, అదే పోలీస్ స్టేష‌న్‌లో దొంగ‌లు ప‌డితే ఎవ‌రికీ చెప్పుకుంటారు..అక్క‌డ ఏకంగా ఓ పోలీస్ స్టేషన్‌లోనే దొంగ‌త‌నం జ‌రిగింది. నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అదికూడా మద్యమే దొంగిలించడం గమనార్హం. వివ‌రాల్లోకి వెళితే…
లాక్ డౌన్ సమయంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై దాడులు చేసిన పోలీసులు సరకును సీజ్ చేశారు. దాన్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అయితే, పోలీస్ స్టేషన్‌లో ఉంచిన మద్యం నిల్వలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని భావించిన పోలీసులు డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, కరీంనగర్ కార్పొరేన్ పరిధిలోని దుకాణాల్లో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు కమిషనర్ క్రాంతి తెలిపారు. దుకాణాలకు నెంబర్లు కేటాయించిన ప్రకారం సరి-బేసి తేదీల్లో ఎవరికి వారు షాపులను తెరుచుకోవాల్సి ఉంటుంద‌న్నారు.