నరసరావుపేటలో కరోనా బీభత్సం..ఇకపై ‘మిషన్ 15’ అమలు..
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. గుంటూరు సిటీ, నరసరావుపేట కేసుల్లో పోటీ పడుతున్నాయి. బుధవారం కొత్తగా మరో 12 మందికి కరోనా పాజిటివ్ తేలినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 363కు చేరింది. వీటిలో అత్యధిక కేసులు కేవలం గుంటూరు సిటీ, నరసరావుపేటలోనే నమోదు కావడం ఆ ప్రాంతాల్లోని ప్రజలకు భయబ్రాంతులకు గురిచేస్తోంది. గుంటూరు సిటీలో కరోనా కేసుల సంఖ్య 162 కాగా.. నరసరావుపేటలో 163కు చేరింది. దీంతో కరోనా […]

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. గుంటూరు సిటీ, నరసరావుపేట కేసుల్లో పోటీ పడుతున్నాయి. బుధవారం కొత్తగా మరో 12 మందికి కరోనా పాజిటివ్ తేలినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 363కు చేరింది. వీటిలో అత్యధిక కేసులు కేవలం గుంటూరు సిటీ, నరసరావుపేటలోనే నమోదు కావడం ఆ ప్రాంతాల్లోని ప్రజలకు భయబ్రాంతులకు గురిచేస్తోంది.
గుంటూరు సిటీలో కరోనా కేసుల సంఖ్య 162 కాగా.. నరసరావుపేటలో 163కు చేరింది. దీంతో కరోనా కేసుల్లో గుంటూరును నరసరావుపేట క్రాస్ చేసింది. జిల్లాలో అత్యధిక కేసులు నమోదైన నరసరావుపేటలో కరోనా వైరస్ నియంత్రణకు అధికారులు యుద్ద ప్రాతిపధికన చర్యలు ప్రారంభించారు. ‘మిషన్ 15’ పేరుతో కార్యాచరణ మొదలుపెట్టారు. అంటే రాబోయే 15 రోజుల తర్వాత కొత్త కేసులు నమోదు కాకూడదనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది.
అయితే జిల్లావ్యాప్తంగా ఇంకా 500కు పైగా నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాతో 8 మంది చనిపోగా.. 129 మంది వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లారు. 226 మంది గుంటూరు ఐడీ, మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ వీరవిహారం చేస్తుండటంతో జిల్లాలో ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలవుతోందని.. ఎలాంటి సడలింపులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.