Covid 19: కరోనా కేసులు పెరగడంతో మూత పడుతున్న స్కూళ్లు.. ఇదే శాశ్వత పరిష్కారమా? నిపుణుల వాదన ఇదే..

Covid 19: కరోనా కేసులు పెరగడంతో మూత పడుతున్న స్కూళ్లు.. ఇదే శాశ్వత పరిష్కారమా? నిపుణుల వాదన ఇదే..
Covid Infection

రానున్న మరో రెండేళ్లపాటు విద్యాసంస్థల్లో కోవిడ్‌ ప్రొటోకాల్‌ ఖచ్చితంగా పాటించితీరాలంటున్న నిపుణులు.. కారణం తెలుసా..

Srilakshmi C

|

Apr 12, 2022 | 10:00 PM

COVID 19 variants will not pose a big threat to students, Experts says: ఘజియాబాద్‌లోని రెండు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. టీచర్లతోసహా మొత్తం16 మందికి కరోనా సోకినట్లు నోయిడా ఆరోగ్య అధికారులు ఏప్రిల్ 11 (సోమవారం)న మీడియాకు తెలిపారు. దీంతో కరోనా ఇన్‌ఫెక్షన్‌ గొలుసుకు అడ్డుకట్టవేయడానికి పరిష్కారంగా.. ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలోనున్న ఓ పాఠశాలను 3 రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. నోయిడా పాఠశాలలు ఏకంగా వారం రోజుల పాటు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు ఒకే పాఠశాలకు చెందిన వారు, ఆ ఇద్దరిలో ఒకరు నోయిడాకు చెందిన విద్యార్ధి. కోవిడ్‌ 19 పరీక్ష ఫలితాలు కూడా విద్యార్థులు పాఠశాలలో ఉన్నప్పుడు కాకుండా, వారి వారి ఇళ్లలో ఉన్నప్పుడు వచ్చినట్లు తెలిశాయి.

ఐతే గత ఫిబ్రవరి చివరి నుంచి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కోవిడ్‌ ప్రొటోకాల్‌కు నీళ్లొదిలేశారు. ఏదిఏమైనప్పటికీ సర్వత్రా అడుగుతున్న ప్రశ్నేంటంటే.. కోవిడ్‌ను అడ్డుకోవడానికి స్కూళ్లను, కాలేజీలను మూసివేయడం అనేది సరైన నిర్ణయమేనా? ఇదే శాశ్వత పరిష్కారమా? నిపుణుల ఏం చెబుతున్నారంటే..

న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌కు చెందిన పల్మోనాలజిస్ట్ డాక్టర్ వినీ కాంత్రూ ఏం చెబుతున్నారంటే.. పాఠశాల విద్యార్ధుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూడడం ఉపాధ్యాయుల బాధ్యత. పిల్లలు సామాజిక దూరాన్ని పాటించేలా చూసుకోవడంలో టీచర్లు, తల్లిదండ్రులు సమప్రాధాన్యత వహించాలి. ఎందుకంటే వైరస్ ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదనే విషయం మనందరికీ తెలుసు. కోవిడ్ ఇన్ఫెక్షన్‌ నుంచి ఏ విధంగా సురక్షితంగా ఉండగలమనే జాగ్రత్తల గురించి, మాస్క్‌ ధరించడం, చేతులు శానిటైజ్‌ చేసుకోవడం వంటి విషయాలు విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధించాలి. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను తొలగించడమనేది మాత్రం సరైన నిర్ణయం కాదు. రోజుకో కొత్త వేరియంట్ పుట్టుకొస్తున్న ప్రస్తుత రోజుల్లో కనీసం స్కూళ్లలోనైనా కోవిడ్‌ జాగ్రత్తలు పాటించవల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు.

ఐతే కోవిడ్‌ నియమాలు ఏవో కొన్ని రోజులు మాత్రమే కాకుండా కనీసం రానున్న రెండేళ్ల పాటైన విద్యాసంస్థలు ఖచ్చితంగా అనుసరించాలి. విద్యార్ధుల చేతులు, తరగతి గదులను శానిటైజ్‌ చేయడానికి మెషిన్లను ఏర్పాటు చేసుకోవాలి. వెంటిలేషన్‌ సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి. వెంటిలేషన్‌ ఉండని గదుల్లో గాలిని శుద్ధి చేసే యంత్రాలు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విధమైన జాగ్రత్తలు పాఠశాలల్లో తప్పనిసరిగా అనుసరించేలా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి.

తల్లిదండ్రులు బాధ్యత ఎంత? తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని, అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు ఏదైనా అనారోగ్యం లేదా ఏవైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే పాఠశాలకు ఫోన్‌ చేసి టీచర్లకు తెలియజేయాలి. మీ పిల్లలు కోలుకునేంత వరకు పాఠశాలలకు పంపకూడదు. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు మాత్రమే కాకుండా స్కూల్‌లోని ఇతర పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారౌతారు. కిడ్నీ వ్యాధులు, పుట్టుకతో గుండె జబ్బులున్న పిల్లల విషయంతో మరింత కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ విధమైన పిల్లలకు హై రిస్క్ ఉంటుందనే విషయం మర్చిపోకూడదు.

XE కొత్త కోవిడ్ వేరియంట్ పిల్లలకు ప్రమాదకారా? గతంలో వచ్చిన ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్లు పిల్లలపై చాలా తక్కువ స్థాయిలో ప్రభావాన్ని చూపాయి. అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్‌ (COVID XE variant) కూడా పిల్లలకు పెద్దగా ముప్పు తలపెట్టదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కొత్త కోవిడ్ వేరియంట్ XE అనేది ఓమిక్రాన్ BA.1, BA.2 వేరియంట్‌లతో ఏర్పడిన రీకాంబినెంట్. ఇది పిల్లలకు తక్కువ హాని తలపెడుతుందని ఇప్పటికే నిరూపించబడింది. SARS CoV-2 పెద్ద మ్యుటేషన్ మార్పుకు లోనయితే తప్ప భయపడవల్సిన అవసరం లేదు.

కాబట్టి కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ నివారణకు పాఠశాలలను మూసివేయడం అనేది శాశ్వత పరిష్కారం కాదు. బదులుగా పాఠశాలలు కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరిస్తే సరిపోతుందని డాక్టర్‌ వినీ కాంత్రూ చెబుతున్నారు.

Also Read:

CUET 2022 రద్దుకు శాసనసభ తీర్మానం.. కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్ధన!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu