Andhra Pradesh: ఆంధ్రాలో కరోనా ఆల్మోస్ట్ ఖతం.. కొత్తగా కేవలం 2 అంటే 2 కేసులు.. కంప్లీట్ వివరాలు

ఏపీలో కోవిడ్ వ్యాప్తి దాదాపు ఆగిపోయినట్లే.. అవును.. తాజాగా వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం రాష్ట్రంలో 2 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

Andhra Pradesh: ఆంధ్రాలో కరోనా ఆల్మోస్ట్ ఖతం.. కొత్తగా కేవలం 2 అంటే 2 కేసులు.. కంప్లీట్ వివరాలు
Ap Corona
Follow us

|

Updated on: Apr 12, 2022 | 6:40 PM

Andhra Corona Updates:  ఇది ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ గుడ్ న్యూస్. రాష్ట్రంలో కరోనా  ఖేల్ ఖతం అయింది. వైరస్ వ్యాప్తి పూర్తిగా ఆగిపోయింది.  తాజాగా 24 గంటల వ్యవధిలో 3,509 శాంపిల్స్ ని పరీక్షించగా కేవలం ఇద్దరికి మాత్రమే కోవిడ్ సోకినట్లు తేలింది.  విశాఖపట్నం జిల్లా(Visakhapatnam district)లో ఇద్దరు కొత్తగా వ్యాధి బారినపడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,616 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 14,730గా ఉంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 41 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో నలుగురు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 23,04,845కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,34,82,472 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కేసులు లేనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. మాస్క్(Face Mask) పెట్టుకుంటే రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు.

రాష్ట్రంలో కోవిడ్ వివరాలను దిగువ ట్వీట్లలో చూడండి…

కరోనా సమాచారం మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.

● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు

● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు

వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.

● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.  ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also Read: Hyderabad: పరుపుల మాటున పత్తి యాపారం.. తెలిస్తే బిత్తరపోవడం ఖాయం