AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: మళ్లీ మొదలైన కరోనా కలకలం.. మూడు పాఠశాలలు మూసివేత.. ఆన్‌లైన్‌ క్లాసులు..

Coronavirus: భారత్‌లో కరోనా థార్డ్‌ వేవ్‌ (Corona) పెద్దగా ప్రభావం చూపకపోవడం, వేగంగా పెరిగిన కేసులు, అంతే వేగంగా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనా పీడ విరగడైందని సంతోషించారు. దీంతో..

Coronavirus: మళ్లీ మొదలైన కరోనా కలకలం.. మూడు పాఠశాలలు మూసివేత.. ఆన్‌లైన్‌ క్లాసులు..
Representative Photo
Narender Vaitla
|

Updated on: Apr 12, 2022 | 4:01 PM

Share

Coronavirus: భారత్‌లో కరోనా థార్డ్‌ వేవ్‌ (Corona) పెద్దగా ప్రభావం చూపకపోవడం, వేగంగా పెరిగిన కేసులు, అంతే వేగంగా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనా పీడ విరగడైందని సంతోషించారు. దీంతో విద్యా వ్యాపార సంస్థలు ఎప్పటిలాగే మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన మళ్లీ ఉలిక్కి పడేలా చేసింది. నోయిడాతో పాటు, గజియాబాద్‌లోని పాఠశాలల్లో పలువురు విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన అధికారులు వెంటనే మూడు పాఠశాలను మూసివేశారు. గజియాబాద్‌లోని రెండు ప్రైవేటు స్కూల్స్‌తో పాటు, నోయిడాలోని మరో పాఠశాలలో మొత్తం 16 కరోనా కేసులు నమోదయ్యాయి.

అయితే వీరికి సోకిన వైరస్‌ ఎక్స్‌ఈ వేరియంట్ అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. అయితే గజియాబాద్‌ మెడికల్‌ ఉన్నతాధికారి భవ్‌తోష్ శంఖదర్‌ మాట్లాడుతూ.. వీలైనంత ఎక్కువగా పరీక్షలు చేస్తున్నామని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో గజియాబాద్‌లోని ఇందిరాపురంకు చెందిన పాఠశాల యాజమాన్యం మూడు రోజులు సెలవులు ప్రకటించారు. నోయిడా పాఠశాల మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించింది. పాఠశాలల్లో పూర్తిగా శాటిటైజేషన్‌ చేసిన తర్వాత పరిస్థితుల అనుగుణంగా ఏప్రిల్‌ 18 నుంచి తిరిగి పాఠశాలలను ప్రారంభించనున్నారు.

మీ చిన్నారులకు ఈ టిప్స్‌ చెప్పండి..

కొత్త వేరియంట్ వ్యాప్తి పెరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు వెళ్లే చిన్నారులు కచ్చితంగా కొన్ని సూచనలు పాటించాలి. తల్లిదండ్రులు వీటిని వారి చిన్నారులకు అర్థమయ్యేలా వివరించాలి. ఇంతకీ ఆ సూచనలేంటంటే..

* మీ పిల్లలకు ప్రమాదకరమైన ఈ వైరస్‌ గురించి వివరించండి.

* శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి తెలియజేయండి.

* చిన్నారులు కచ్చితంగా మాస్క్‌ ధరించేలా చూడండి. అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయండి.

* చిన్నారులకు టిఫిన్‌ బాక్స్‌తో పాటు కచ్చితంగా శానిటైజర్‌ను కూడా వెంట పంపించండి.

* ఫిజికల్ డిస్టెన్స్‌ గురించి అర్థమయ్యేలా చెప్పండి. స్కూల్‌ అవ్వగానే నేరుగా ఇంటికి వచ్చేయమని సూచించండి.

* అన్నింటికి కంటే ప్రధానమైంది ఒకవేళ మీ పిల్లలు వ్యాక్సినేషన్‌కు అర్హులైతే వెంటనే ఇప్పించండి.

Also Read: Viral Video: స్టేజ్ పై వధువు డ్యాన్స్.. అదిరిపోయే స్టెప్పులకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

Meat-eating: దేశంలో నాన్‌ వెజ్‌పై కొత్త వివాదం.. మాంసాహారం భారతీయుల ఆహారంలో భాగమేనా..?

Ukraine: యుద్ధాన్ని సైతం లెక్క చేయని ప్రేమ జంట.. ఉక్రెయిన్‌ అమ్మాకికి ప్రపోజ్‌ చేసిన భారత లాయర్‌.. ఢిల్లీలో వివాహం