Viral Video: స్టేజ్ పై వధువు డ్యాన్స్.. అదిరిపోయే స్టెప్పులకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
కరోనా శాంతిస్తోంది... జనాల జీవన సరళి ట్రాక్‌లో పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రెండేళ్లకు పైగా ఫంక్షన్లు, విందులు
కరోనా శాంతిస్తోంది… జనాల జీవన సరళి ట్రాక్‌లో పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రెండేళ్లకు పైగా ఫంక్షన్లు, విందులు వినోదాలకు దూరమైన ప్రజలు సంతోసంగా అడుగు ముందుకేస్తున్నారు. పెళ్లిల్లు జోరుగా జరుగుతున్నాయి. మూడేళ్లుగా పెళ్లి వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు ఘనంగా వివాహ వేడుక జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తమ పెళ్లి వేడుకలను ఎంతో ఘనంగా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పెళ్లిలో వధూవరులు డ్యాన్స్ చేయానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తమ మనసులోని భావాలను పాట రూపంలో తెలియజేస్తూ… అందమైన హావాభావాలు పలికిస్తూ వధువులు డ్యాన్స్ చేసే వీడియోలను మనం చూసే ఉంటాం. ఇప్పుడు ఓ వధువు తన సంగీత్ ఫంక్షన్‌లో బాలీవుడ్ హిట్‌సాంగ్‌పై డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఆకాంక్ష మిశ్రా అనే వధువు తన సంగీత్ ఫంక్షన్లో ‘బోలె చూడియా’ పాటపై అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ పాట 2001లో విడుదలైన ‘కభీ ఖుషీ కభీ గమ్’ అనే బాలీవుడ్ చిత్రంలోనిది. ఈ పాటంటే వధువుకు ఎంతో ఇష్టమట.. అందుకే తన పెళ్లి వేడుకలో ఇదే పాటకు అందంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. అందమైన లెహంగాలో స్టేజ్పై తళుక్కుమన్న వధువు వేసిన అదిరిపోయే స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా అమ్మాయి హావాభావలతో అందంగా డ్యాన్స్ చేసి నెటిజన్ల మనసులు దొచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసినవారంతా ఫిదా అయిపోతున్నారు. నవ వధువును తమ కామెంట్లతో ఆశీర్వదిస్తున్నారు.
Also Read: Priyamani: ట్రోల్స్ పై స్పందించిన ప్రియమణి.. కొన్నిసార్లు జీర్ణించుకోలేకపోయేదాన్ని అంటూ..
Dasara Movie: గోదావరిఖనిలో దసరా చిత్రయూనిట్ సందడి.. నాని, కీర్తి సురేష్ మధ్య సాంగ్ షూటింగ్..
Vijay Thalapathy: ఆ కారణంతోనే దూరంగా ఉంటున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన విజయ్..
Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద..