శ్రీవారి దర్శనాలపై టీటీడీ క్లారిటీ..! ఇకపై కోరినన్ని లడ్డూలు..

జూన్ 1వ తేదీ నుంచి తిరిగి శ్రీనివాసుడి దర్శనాలకు భక్తులకు అనుమతిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది టీటీడీ. అయితే,

శ్రీవారి దర్శనాలపై టీటీడీ క్లారిటీ..! ఇకపై కోరినన్ని లడ్డూలు..
అలాగే 35.26 లక్షల శ్రీవారి లడ్డూలు జులై మాసంలో విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Follow us

|

Updated on: May 20, 2020 | 3:40 PM

ఏడుకొండల వాడి దర్శనం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం కొండంత దేవుడిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు దేశంలోని భక్తులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచిచూస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా స్వామివారి దర్శనాలు నిలిచిపోవటంతో భక్తులు నిరాశలో ఉన్నారు. అయితే, కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ -4 మే 31తో ముగుస్తుండగా, జూన్ 1వ తేదీ నుంచి తిరిగి శ్రీనివాసుడి దర్శనాలకు భక్తులకు అనుమతిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది టీటీడీ. అయితే, ఈ క్రమంలోనే మరోమారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు.

లాక్‌డౌన్‌ కారణంగా గత 60 రోజులుగా భక్తులకు వెంకన్న దర్శనం కల్పించలేక పోయామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడు దర్శనాలు ప్రారంభిస్తామో చెప్పలేము అని ఆయన స్పష్టం చేశారు. భక్తులకు స్వామి వారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తున్నామని తెలిపారు. రూ. 25కే లడ్డూ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రత్యేక ఆర్డర్‌పై స్వామి వారి లడ్డూలు పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు ఎంత మొత్తంలో కావాలన్నా..పంపిణీ చేస్తామని తెలిపారు. భక్తులు కోరినన్ని లడ్డూలు పొందే సదుపాయం అందుబాటులోకి తెస్తామని, అందుకోసం ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లక్షల లడ్డూలను తయారు చేయిస్తున్నామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సమయంలోనూ భక్తులు ఈ హుండీ ద్వారా స్వామి వారికి కానుకలు సమర్పిస్తున్నారని చెప్పారు. టీటీడీ ఆర్థిక పరిస్థితిపై మీడియాలో వస్తున్నదంతా వాస్తవం కాదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.