‘ఇండియన్ వైరస్ ఆ దేశాల వైరస్ కన్నా ప్రమాదకరం’.. నేపాల్ పీఎం

నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఒక్కసారిగా ఇండియాపై ధ్వజమెత్తారు. ఇండియా నుంచి వచ్ఛే వైరస్.. చైనీస్, ఇటాలియన్ వైరస్ కన్నా చాలా హానికరమైనదిగా కనిపిస్తోందన్నారు. తమ దేశంలో కరోనా కేసుల వ్యాప్తికి ఇండియాయే కారణమని ఆరోపించారు. నేపాల్ పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. భారత దేశం నుంచి అక్రమంగా, చట్ట విరుద్ధంగా తమ దేశంలో ప్రవేశిస్తున్నవారు ఈ వైరస్ ని వ్యాప్తి చెందింపజేస్తున్నారని, కొంతమంది లోకల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు సరైన టెస్టింగ్ నిర్వహించకుండానే ఇండియా నుంచి ఇక్కడికి […]

  • Umakanth Rao
  • Publish Date - 2:58 pm, Wed, 20 May 20
'ఇండియన్ వైరస్ ఆ దేశాల వైరస్ కన్నా ప్రమాదకరం'.. నేపాల్ పీఎం

నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఒక్కసారిగా ఇండియాపై ధ్వజమెత్తారు. ఇండియా నుంచి వచ్ఛే వైరస్.. చైనీస్, ఇటాలియన్ వైరస్ కన్నా చాలా హానికరమైనదిగా కనిపిస్తోందన్నారు. తమ దేశంలో కరోనా కేసుల వ్యాప్తికి ఇండియాయే కారణమని ఆరోపించారు. నేపాల్ పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. భారత దేశం నుంచి అక్రమంగా, చట్ట విరుద్ధంగా తమ దేశంలో ప్రవేశిస్తున్నవారు ఈ వైరస్ ని వ్యాప్తి చెందింపజేస్తున్నారని, కొంతమంది లోకల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు సరైన టెస్టింగ్ నిర్వహించకుండానే ఇండియా నుంచి ఇక్కడికి వారిని రప్పిస్తున్నారని అన్నారు. వాళ్ళే ఇందుకు బాధ్యులన్నారు. బయటి నుంచి వస్తున్న వారి కారణంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడం చాలా కష్టమన్నారు. తమదేశ అంతర్భాగంలోని కాలాపానీ, లింపియాధుర, లిపిలేఖ్ భూభాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని శర్మ పేర్కొన్నారు. కాగా.. నేపాల్ లో కరోనా వైరస్ కి ఇండియాయే కారణమన్న ఆయన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.