AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య..ఆ రోజున ‘భూమిపూజ’ను ఇళ్లలోనే చూడండి..ట్రస్ట్

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న జరిగే భూమిపూజను చూసేందుకు ఆసక్తిగా అయోధ్యకు రావద్దని, ఈ కార్యక్రమాన్ని ఇళ్లలోనే టీవీల్లో చూడాలని దేశవ్యాప్తంగా గల భక్తులకు రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్..

అయోధ్య..ఆ రోజున 'భూమిపూజ'ను ఇళ్లలోనే చూడండి..ట్రస్ట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 4:30 PM

Share

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న జరిగే భూమిపూజను చూసేందుకు ఆసక్తిగా అయోధ్యకు రావద్దని, ఈ కార్యక్రమాన్ని ఇళ్లలోనే టీవీల్లో చూడాలని దేశవ్యాప్తంగా గల భక్తులకు రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. దీన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని ఈ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం భక్తులంతా ఇళ్లలోనే దీపాలు వెలిగించాలని ఆయన కోరారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో తాము వినమ్రంగా ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆ రోజున కేవలం పరిమితంగా 200 మంది గెస్టులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. ప్రధాని మోదీ భూమి పూజను నిర్వహిస్తారని, చంపక్ రాయ్ వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి లక్షలాది భక్తులు ప్రత్యక్షంగా..పరోక్షంగా తమ మద్దతును తెలియజేస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆగస్టు 5 న దేశవ్యాప్తంగా పూజారులు ఆలయాల్లో ఉదయం పదకొండున్నర గంటల నుంచి (గంట పాటు….) మధ్యాహ్నం పన్నెండున్నర గంటలవరకు పూజలు చేయాలని  చంపక్ రాయ్ సూచించారు.