AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్థాన్‌లో తాజాగా మరో 694 పాజిటివ్ కేసులు

రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 694 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా..

రాజస్థాన్‌లో తాజాగా మరో 694 పాజిటివ్ కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2020 | 3:27 PM

Share

రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 694 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,324కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 47,965 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని రాజస్థాన్‌ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 897 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 19.30 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం అరలక్షకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 27.02 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని 19.77 లక్షల మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6.73 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

Follow Us