ప్రధానిపై అసభ్య పోస్టులు.. ఐదుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..

ప్రస్తుతం ప్రపంచ మంతా కరోనా ప్రభావంతో వణికిపోతుంది. ఈ మహమ్మారి దాటికి మన దేశంలో కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. నాలుగు వేల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు మూడు వారాల పాటు.. (ఏప్రిల్14 వరకు) దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ప్రధాని తీసుకునే పలు నిర్ణయాలపట్ల.. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. తాజాగా రెండు రోజుల […]

  • Publish Date - 4:18 pm, Mon, 6 April 20 Edited By:
ప్రధానిపై అసభ్య పోస్టులు.. ఐదుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..

ప్రస్తుతం ప్రపంచ మంతా కరోనా ప్రభావంతో వణికిపోతుంది. ఈ మహమ్మారి దాటికి మన దేశంలో కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. నాలుగు వేల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు మూడు వారాల పాటు.. (ఏప్రిల్14 వరకు) దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ప్రధాని తీసుకునే పలు నిర్ణయాలపట్ల.. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.

తాజాగా రెండు రోజుల క్రితం.. ప్రధాని మోదీ దేశ యువతనుద్దేశిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9.00 గంటలకు 9 నిమిషాల పాటు. ఇళ్లలోని లైట్లు ఆర్పేసి.. ఇంటి గుమ్మం ముందు దీపాలు, క్యాండిల్స్‌, లేదా.. సెల్ ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్లను వెలిగించాలంటూ సందేశాన్నిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన వీడియోని ఇమిటేట్‌ చేస్తూ.. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన కొందరు యువకులు మద్యం సేవిస్తూ..” ప్రధాని చెప్పినట్లు చేతులు కడుక్కుంటే వైరస్ పోతుందా.. దీపాలు పెడితే వైరస్‌ చస్తుందా..” అంటూ అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. బీజేపీ నేతల వరకు ఈ విషయం చేరింది. దీంతో సదరు పోస్టులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్టింగ్స్‌ చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. గత వారం అసోంలో కూడా ప్రధానిపై అసభ్య పోస్టింగ్‌ పెట్టడంతో జైలు పాలయ్యాడు.